సంజు ఫ్యాన్స్ ను చల్లార్చే పనిలో బీసీసీఐ.. ఏం చేయబోతుందంటే?

praveen
గత కొంతకాలం నుంచి సంజు శాంసన్  అభిమానులు అందరూ కూడా బీసీసీఐ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మొన్నటికి మొన్న ఐపిఎల్ లో అద్భుతంగా రానించి టీమ్ ఇండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంజు శాంసన్ ఇక టీమ్ ఇండియా తరపున కూడా అద్భుతంగా రానించాడు.. ఇలాంటి సమయంలో ఇక సంజు శాంసన్ కు టి20 వరల్డ్ కప్ లో చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఊహించిన రీతిలో బీసీసీఐ అతని పక్కన పెట్టేసింది అన్న విషయం తెలిసిందే. దీంతో వరల్డ్ కప్ లో అతనికి చోటు దక్కకపోవడం పై అటు కేరళ ఫ్యాన్స్ మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా అటు సౌత్ ఆఫ్రికా తో తిరువనంతపురం వేదికగా మొదటి టి20 మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ లో నిరసన జ్వాలలు వినిపించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు సంజు శాంసన్ అభిమానులు. ఇక ఇటీవలే తొలి టి20 మ్యాచ్ కోసం కేరళకు చేరుకున్న టీమిండియా కు కూడా ఇలాంటి నిరసన సెగ ఎదురయింది అన్న విషయం తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లను చూడగానే సంజు సంజు అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు అభిమానులు.  ఈ విషయాన్ని పలువురు భారత క్రికెటర్లు తన సోషల్ మీడియా ఖాతాలో కూడా పంచుకున్నారు.

 కాగా ప్రస్తుతం భారతీయ ఏ జట్టుకు  కెప్టెన్ గా  వ్యవహరిస్తున్నాడు సంజు శాంసన్. ఇకపోతే సౌత్ ఆఫ్రికా తో జరిగే వన్డే సిరీస్ కు వైస్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే బీసీసీఐ అధికారులు సంజు శాంసన్ అభిమానులను సముదాయించే పనిలో పడ్డారట. కాగా సౌత్ ఆఫ్రికా తో వన్డే సిరీస్ కి శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. కాగా వరల్డ్ కప్ ఆడబోయే ప్లేయర్లు అందరినీ కూడా ఈ వన్డే సిరీస్ నుంచి రెస్ట్ కల్పించింది టీమ్ ఇండియా మేనేజ్మెంట్. తద్వారా ఇక టీమిండియా వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్ ను ఎంపిక చేసి అతని అభిమానులను కాస్త సాటిస్ఫై చేయాలని భావిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: