అతను ఆస్ట్రేలియా జట్టులో ఉంటే.. ప్రత్యర్ధులు భయపడతారు?

praveen
ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్లో ఒక యువ బ్యాట్స్మెన్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు . ఆస్ట్రేలియా జట్టులోకి అరంగేట్రం చేసిన యువ ఆటగాడు టిమ్ డేవిడ్ ఇటీవల భారత్తో జరిగిన టి20 సిరీస్లో అద్భుతమైన నాక్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. మొదటి టీ20 లో మూడవ టీం లలో మెరుపు హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు అని చెప్పాలి.. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టు సిరీస్ కోల్పోయినప్పటికీ అతను మాత్రం అందరి మనసులు గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే అతనిపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాళ్లు ఆడమ్ గిల్ క్రిస్ట్, మార్క్ వా.. ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 ప్రపంచ కప్ లో ఆసిస్ తుదిచెట్టులో టిమ్ డేవిడ్ కచ్చితంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అతడు జట్టులో ఉంటే ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది అంటూ కామెంట్ చేశారు.  ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టులో గతంలో ఇలాంటి బిగ్ హిట్టర్ ఎవరూ లేరు.  కాబట్టి అతను బ్యాటింగ్ కు వస్తున్నాడు అంటే ప్రత్యర్థి జట్లు తప్పకుండా భయపడతాయి  అతను పవర్ హిట్టింగ్ చేసే విధానం ఎంతో అద్భుతంగా ఉంది.  గత 18 నెలలుగా అతని నుంచి ఎలాంటి ప్రదర్శనలు వచ్చాయో కల్లారా చూసాం.

 భిన్నమైన పరిస్థితుల్లో కూడా బాగా ఆడుతున్నాడు. ఇక ఆస్ట్రేలియా జట్టు తరఫున మంచి బ్యాట్స్మెన్ పాత్రను పూరించడానికి టిమ్ డేవిడ్ సమర్థుడు  15 లేదా 20 బంతులు ఉన్నప్పుడు టిమ్ డేవిడ్ లాంటి వ్యక్తి ఉంటే ఫినిషింగ్ అద్భుతంగా ఉంటుంది అంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గిల్ క్రిస్ట్ చెప్పుకొచ్చాడు.  ఇక మరో మాజీ ఆటగాడు మార్క్ వా కూడా గిల్ క్రిస్టుతో ఏకీభవిస్తున్నట్లు తెలిపాడు. అయితే ప్రస్తుతం వార్నర్మ్యూచువల్, మిచెల్ మార్ష్,  స్టోయినిస్ లాంటి ఆటగాళ్ళు జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో..  అతనికి జట్టులో చోటు దక్కింది. ఇక వాళ్ళు మళ్ళీ తిరిగి జట్టులోకి వస్తే అతని స్థానం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మాజీ ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: