బుమ్రా వస్తేనే.. అలా జరుగుతుంది : సంజయ్ బంగర్

praveen
జస్ప్రిత్ బూమ్రా.. టీమ్ ఇండియా లో ఎంత కీలక బౌలర్ అనే విషయం ఇటీవల అతడు గాయం బారినపడి జట్టుకు దూరమైన  సమయంలో స్పష్టంగా తెలిసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  జస్ప్రిత్ బూమ్రా లేకుండా టీమ్ ఇండియా ఆడిన ఏ మ్యాచ్లో కూడా బౌలింగ్ విభాగం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అనే చెప్పాలి. ఎందుకంటే డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా కొనసాగుతున్నా జస్ప్రిత్ బూమ్రా కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టడమే కాదు డెత్ ఓవర్లలో ఉండే ఒత్తిడిని కూడా తట్టుకుంటూ అద్భుతమైన బంతులను సందిస్తూ ఉంటాడు. అందుకే టీమిండియాలో అతనికి డేట్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ అనే పేరు కూడా వచ్చింది.

 అలాంటి జస్ప్రిత్ బూమ్రా ఇటీవలే గాయం బారినపడి జట్టుకు దూరమైన నేపథ్యంలో కీలకమైన ఆసియా కప్ టోర్నీలో టీమిండియా పెద్దగా రాణించలేక పోయింది. ఈ క్రమంలోనే  తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది అని చెప్పాలి. టీమ్ ఇండియా లో ఉన్న మిగతా బౌలర్లు డెత్ ఓవర్లలో చేతులెత్తేసి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో బ్యాటింగ్ విభాగం ఎంత కష్టపడినా టీమ్ ఇండియాకు ఓటమి తప్పలేదు. ఇక ఇటీవలే భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది అన్న విషయం తెలిసిందే.

 ఇక బుమ్రా లేకపోతే టీమిండియా గెలవడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అందరు. ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్ ఇండియా ప్రధాన ఫేసర్ జస్ప్రిత్ బూమ్రా తిరిగి జట్టులోకి వస్తేనే బౌలింగ్ విభాగం పటిష్టంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.  ఇక అతను వస్తే టీమిండియా బౌలింగ్ లో మార్పు వస్తుందని మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసి డెత్ ఓవర్లలో పరుగులను కట్టడి చేసి బూమ్రా ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టగలడు అంటూ సంజయ్ బంగర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: