అతన్ని జట్టులోకి తీసుకోకుండా.. మంచి పని చేశారు : ఇర్ఫాన్ పఠాన్

praveen
అక్టోబర్ 16 వ తేదీ నుంచి ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది . అయితే ప్రపంచ కప్ అంటే ఏ జట్టు కైనా సరే ఎంతో ప్రతిష్టాత్మకమైనదే అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో పాల్గొనబోయే అన్ని జట్లు కూడా ది బెస్ట్ ఆటగాళ్ల తోనే బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యాయి.  వరల్డ్ కప్ లో పాల్గొంటున్న అన్ని జట్లు ఇక ప్రపంచ కప్లో తమ జట్టు తరపున ఆడబోయే ఆటగాళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక బీసీసీఐ కూడా వరల్డ్ కప్ ఆడబోయే 15 మంది సభ్యుల వివరాలను ప్రకటించింది.

 ఇక బిసిసిఐ ఇలా జట్టు ప్రకటన చేసిందో లేదో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా జట్టులో ఉన్న ఆటగాళ్లకు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. కొంతమంది ఆటగాళ్లను తీసుకొని ఉంటే బాగుండేది అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటే.. ఇక మరికొంతమంది జట్టులోకి అలాంటి ఆటగాళ్లను ఎలా తీసుకున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉన్న ఘటనలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అయితే ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున స్పీడ్ గన్ గా  పేరు సంపాదించుకున్న యువ బౌలర్ ఇమ్రాన్ మాలిక్ కేవలం టీమిండియా తరపున కొన్ని మ్యాచ్లకు మాత్రమే పరిమితం అయ్యాడు.

 ఇక వరల్డ్ కప్ లో కూడా అతనికి చోటు దక్కలేదు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. వరల్డ్కప్కు ఉమ్రాన్ మాలిక్ ను ఎంపిక చేయకపోవడం సరైన నిర్ణయమే అంటూ చెప్పుకొచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ కు ఇంకా తగిన అనుభవం రాలేదు.  అతను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అతను ఇంకొన్నాళ్ళు ఇండియా ఎ జట్టు తరఫున మ్యాచ్ లు ఆడి అనుభవం సాధించాల్సి ఉంది. ఇక అతనికి కూడా ఓ సమయం వస్తుంది అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: