అదరగొట్టిన టీమిండియా.. ప్రతీకారం తీర్చుకుందిగా?

praveen
ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా అద్భుతంగా రాణించిన టీమిండియా జట్టు అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే టీమిండియా మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ కూడా అంతకు మించిన ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్ జట్టు చివరికి టి20 సిరీస్ లో విజయం సాధించిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే మూడో టి-20లో సిరీస్లో భాగంగా 2-1 తేడాతో ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అయితే టీ20 సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు పైచేయి సాధిస్తే వన్డే సిరీస్లో మాత్రం టీమిండియా అదరగొట్టేసింది. వన్డే సిరీస్లో భాగంగా  జరిగిన మొదటి మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా.. ఇక రెండో మ్యాచ్లో కూడా భారీ విజయాన్ని అందుకుంది అనే చెప్పాలి. ముఖ్యంగా భారత బ్యాటర్లు  ఇంగ్లాండ్ బౌలర్లలో చెడుగుడు ఆడేశారు. ఈ క్రమంలోనే 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేశారు. ఇందులో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 143 పరుగులతో సెంచరీ తో చెలరేగింది. ఈ క్రమంలోనే టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసిన నేపథ్యంలో విజయం టీమిండియా వశం అయింది.

 334 పరుగుల లక్ష్యం తో బరి లోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు చివరికి భారత బౌలర్ల ధాటికి పరుగులు చేయలేకపోయింది. 44.4 ఓవర్లలో 246 పరుగులు చేసి చివరికి ఆల్ అవుట్  అయ్యింది ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు. తద్వారా ఇక 85 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది టీమిండియా. ఈ క్రమంలోనే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి. తద్వారా టీ20 సిరీస్ లో ఓడిపోయిన టీమిండియా వన్డే సిరీస్లో మాత్రం ప్రతీకారం తీర్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: