ఆదుకుంటాడు అనుకుంటే.. అతనే టీమిండియా కొంపముంచాడు?

praveen
ఇటీవలి కాలం లో టీమిండియా వరుస పరాజయాల పాలు అవుతూ ఉండడం తో అభిమానులందరినీ కూడా నిరాశే మిగులుతుంది  అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ఆసియా కప్లో భాగంగా రెండు మ్యాచ్ లలో గెలిచి పటిష్టం గా కనిపించిన టీమిండియా కీలకమైన మ్యాచ్లnలో మాత్రం ఓటమి చవి చూసింది. తద్వారా ఫైనల్లో అడుగు పెట్టకుండానే ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమం లోనే అక్టోబర్లో వరల్డ్ కప్ ఉన్న నేపథ్యం లో ఆసియా కప్ లో చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా టీమిండియా చూసుకుంటుంది అని అందరూ అనుకున్నారు. ఇటీవల జరిగిన మ్యాచ్లో అలా మాత్రం జరగలేదు అని చెప్పాలి. ఇటీవల సొంత గడ్డపై ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమ్ ఇండియా జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది. బ్యాటింగ్ లో అదరగొట్టినప్పటికీ టీమిండియా బౌలర్లు మాత్రం మ్యాచ్ మొత్తాన్ని తీసుకెళ్లి ఆస్ట్రేలియా చేతిలో పెట్టేశారు అనే చెప్పాలి.  ముఖ్యం గా డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు సమర్పించు కోవడం గమనార్హం.

 అయితే జట్టు లోకి హర్షల్ పటేల్ రావడం తో ఎంతో మంది టీమిండియా కు తిరుగులేదు అని అనుకున్నారు. అతను డెత్ ఓవర్లలో పరుగులు ను కట్టడి చేయ గలడు అని భావించారు.  కానీ ఎంతో నమ్మకం పెట్టుకుంటే చివరికి హర్షల్ పటేల్ టీమిండియా కొంప ముంచాడు. ఇటీవలే ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో 49 పరుగులు సమర్పించుకున్నాడు. కీలకమైన 18వ ఓవర్లోనే పరుగులు కట్టడి చేయాల్సింది పోయి 22 పరుగుల ఇచ్చాడు హర్షల్ పటేల్. షార్ట్ పిచ్ బంతుల్లో సిక్సర్లు కొడుతున్న పదేపదే అలాంటి బంతులు వేసి పరుగులు సమర్పించుకున్నాడు హర్షల్ పటేల్. అతని ప్రదర్శనపై టీమిండియా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: