యువరాజ్ సింగ్ కొత్త అవతారం.. ఆ జట్టుకు మెంటార్ గా?

praveen
టీమిండియా క్రికెట్ లో యువరాజ్ సింగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోని బెస్ట్ ఫ్రెండ్ గా అదిరిపోయే ఆల్రౌండర్గా టీమ్ ఇండియా జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ఎంతగానో పేరు సంపాదించుకున్నాడు యువరాజ్ సింగ్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా అభిమానులు అందరూ కూడా ఈ మాజీ క్రికెటర్ ని సిక్సర్ల వీరుడు అని ముద్దుగా పిలుచుకుంటారు అని చెప్పాలి. ఎందుకంటే టీ-20 ఫార్మెట్లో ఆరు బంతులలో ఆరు సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రమే కావడం గమనార్హం.

 అంతేకాదు ధోనీ కెప్టెన్సీలో 2007, 2011 ప్రపంచ కప్ గెలవడం లో యువత పాత్ర ఎంతో కీలకంగా ఉంది అని చెప్పాలి. ఇకపోతే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్ ప్రస్తుతం ఆటకు దూరంగానే ఉంటున్నాడు. అయితే ఏదో ఒక విధంగా మళ్ళీ క్రికెట్ తో సంబంధాలు కొనసాగించాలని యువరాజ్ సింగ్ భావిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవల టీమిండియా స్టార్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇటీవల ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు అని తెలుస్తూ ఉంది.

 ఏకంగా పొట్టి ఫార్మాట్లో ఒక జట్టుకు కోచ్గా వ్యవహరించ పోతున్నాడట యువరాజ్ సింగ్. అయితే ఇది ఐపీఎల్ లో కాదు లెండి. అబుదాబి టి10 లీగ్ లో 2022 సీజన్కు న్యూయార్క్ స్ట్రైకర్స్ జట్టు తరఫున మెంటర్ గా ఇక భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ఎంపికయ్యాడు అనేది తెలుస్తుంది. 2019 సీజన్లో మరాఠా అరేబియాన్స్ జట్టులో ప్లేయర్ గా ప్రాతినిధ్యం వహించాడు యువీ. ఇక తన కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పలు గ్లోబల్ ఫ్రాంచైజీ టోర్నమెంట్లలో ఆడాడు. ఇక ఇప్పుడు లెజెండ్స్ లీగ్ క్రికెట్, రోడ్ సేఫ్టీ లీగ్ లలోను యువరాజ్ సింగ్ ఆడుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: