వైరల్ : కొబ్బరి చెట్టు ఎక్కిన చిరుతపులి.. చివర్లో ట్విస్ట్?

praveen
అడవుల్లో ఉండే జంతువులకు సంబంధించిన వీడియోలు ఎప్పుడు సోషల్ మీడియా లోకి వచ్చి కూడా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో కి వస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయ్. ముఖ్యంగా  ఇటీవలి కాలంలో చిరుతపులులు అయితే జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. పంట పొలాల్లో కూడా అప్పుడప్పుడు చిరుతపులులు దర్శనమిస్తున్న వీడియోలు ఎన్నో సంచలనంగా మారిపోతున్నాయ్. అయితే చిరుతపులులు చెట్లను ఎంతో అలవోకగా ఎక్కుతాయి అన్న విషయం అందరికి తెలిసిందే.

 ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో చూసుకుంటే ముందుగా ఒక చిరుతపులి కొబ్బరి చెట్టు ఎక్కుతుంది. ఆ తర్వాత మెల్లిగా కిందికి దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ చివర్లో ఊహించని ట్విస్ట్ తో ప్రతి ఒక్కరికి కూడా భయం పుడుతుంది అని చెప్పాలి. ఈ వీడియో కాస్త ట్విట్టర్లో తెగ చక్కెర్లు కొడుతుంది. సాధారణంగా చిరుతపులులు చెట్టుపై ఉండి మిగతా జంతువులు అక్కడికి వచ్చినప్పుడు దాడిచేసి వేటాడటం చేస్తూ ఉంటాయి. ఇక్కడ కొబ్బరి చెట్టు మీదకు ఎక్కిన చిరుతపులి ఇలాంటిదే చేస్తోంది అని అందరూ అనుకుంటారు.

 కొబ్బరి చెట్టు మీదకు ఎక్కిన చిరుతపులి కాసేపు ఉండి చుట్టుపక్కల ప్రాంతాన్ని గమనిస్తూ వుంది.  ఈ క్రమంలోనే  ఏదైనా జంతువును వేటాడుతూ ఉందేమో  అని అందరూ అనుకుంటారు. కానీ చిరుతపులి కిందకి దిగబోతోంది అనుకుంటున్న సమయంలో మరో చిరుత పులి ఇక ఆ పంట పొలంలో నుంచి ఆ చిరుత పై దాడి చేయడానికి వెళుతుంది. దీంతో భయంతో చెట్టు మీద ఉన్న చిరుతపులి క్షణాల వ్యవధిలో చిటారు కొమ్మ కు చేరుకుంటుంది. మరో చిరుత పులి కూడా వేగంగా వెళ్లి చెట్టు మీదే పోట్లాడటం చేస్తూ ఉంటుంది.. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్లో వెలుగులోకి వచ్చింది అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: