యువీ విధ్వంసానికి.. సరిగ్గా 15 ఏళ్లు?

praveen
ప్రపంచ క్రికెట్లో భారత మాజీ క్రికెటర్   యువరాజ్ సింగ్ ఒక ప్రత్యేకమైన ప్రస్థానాన్ని కొనసాగించారు అన్న విషయం తెలిసిందే.  అసలు సిసలైన నిఖార్సయిన ఆల్ రౌండర్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా తన ఆటతీరుతో ఎంతగానో గుర్తింపును సంపాదించుకున్నాడు యువరాజ్ సింగ్. ఎప్పుడూ బౌలర్లపై సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతు ఉండేవాడు. టీమిండియాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక టీం ఇండియా రెండు వరల్డ్ కప్  లు గెలవడం లో కూడా యువరాజ్ సింగ్ పాత్ర ఎంతో కీలకం అనేది అందరికీ తెలిసిన విషయమే.

 అయితే యువరాజ్ సింగ్ కెరీర్ మొత్తంలో ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోయే అద్భుతమైన  ఇన్నింగ్స్ ఏదైనా ఉంది అంటే అది ఇంగ్లాండ్ పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఇన్నింగ్స్ కావడం గమనార్హం. యువరాజ్ సింగ్ ఈ అరుదైన ఘనత సాధించడం తో ముందు కూడా ఒక్కసారిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇదే రోజు పదిహేనేళ్ల క్రితం యువరాజ్ సింగ్ ఈ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. సౌతాఫ్రికాలో 2007లో మొదటి టి20 వరల్డ్ కప్ జరుగుతుంది.

 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. నువ్వా నేనా  అన్నట్లుగానే ఈ మ్యాచ్ సాగింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చేస్తూ అప్పటికే మంచి ఊపులో ఉన్నాడు. ఇలాంటి సమయంలోనే ఇంగ్లాండ్ బౌలర్ ఫ్లింటాఫ్ యువరాజ్ సింగ్ తో మాటల యుద్ధానికి దిగాడు. దీంతో చిర్రెత్తు కొచ్చిన యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో ఆరు బంతులలో ఆరు సిక్సర్లు కొట్టాడు. క్రికెట్లో ఈ రికార్డు సాధించిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: