క్రికెటర్ గా మారబోతున్న.. పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్?

praveen
పరుగుల వీరుడు ఉసెన్ బోల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా తన పరుగులతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఉసెన్ బోల్ట్. ఇప్పటి వరకు ఎన్నో రికార్డులను కూడా కొల్లగొట్టాడు అన్న విషయం తెలిసిందే. అంతే కాదు అంతర్జాతీయ వేదికలపై తన పరుగులతో సత్తా చాటి ఎన్నో మెడల్స్ కూడా సాధించాడు. ఇక ఉసేన్ బోల్ట్ ఎంతలా తన ప్రభావం చూపించాడు అంటే ప్రస్తుతం పరుగుల పందెం అనే పేరు వినిపించింది అంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా ఉసెన్ బోల్ట్ గుర్తుకు వస్తాడు అని చెప్పాలి.

 ఇలా రన్ మెషిన్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ఉసెన్ బోల్ట్ తన కెరీర్లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టి ఎన్నో మెడల్స్ సొంతం చేసుకున్నాఫు. ఉసేన్ బోల్ట్ ఇటీవల తన కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే.  ఇక ఈ నిర్ణయం తో అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యారు అని చెప్పాలి. మొన్నటి వరకు అథ్లెట్ గా కొనసాగి రిటైర్మెంట్  తీసుకున్న ఉసెన్ బోల్ట్ ఇక ఇటీవల మాత్రం క్రికెటర్గా మారబోతున్నాడు అన్నది తెలుస్తుంది.  పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ ఏంటి.. క్రికెటర్ గా మారడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.

 తనకు క్రికెటర్ కావాలి అనేది ఒక కళ అంటూ గతంలో ఎన్నోసార్లు చెప్పాడు ఉసేన్ బోల్ట్. ఇప్పుడు అథ్లెట్గా రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేది తెలుస్తుంది.  క్రికెటర్ అవ్వాలన్న కలను త్వరలోనే నెరవెరబోతుందట. క్రికెటర్ గా మారడానికి క్రికెట్ కోచింగ్ పాఠాలు వింటూ ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉన్నాడట. గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగ్ లో ఆడబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మేరకు టోర్నీ నిర్వాహకులు  ఉసేన్ బోల్ట్ కు ఆహ్వానం పంపడం గమనార్హం. న్యూఢిల్లీలో అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు కూడా గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగ్ జరగబోతుంది అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: