అనిల్ కుంబ్లే ని పీకిపారేసారూ.. ఆ జట్టుకు కొత్త కోచ్?

praveen
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎన్నో జట్లు పేలవ ప్రదర్శనతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడాది ఐపీఎల్లో చేసిన తప్పులను వచ్చే ఏడాది సీజన్ లో మాత్రం పునరావృతం  కాకుండా ఉండేలా ఆయా జట్టు ఫ్రాంచైజీలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో కప్పు కొట్టాలని లక్ష్యంతో నెలల ముందు నుంచి అన్ని విషయాలలో కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే జట్టులోని ఆటగాళ్లు సహ కోచింగ్ సిబ్బంది విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.

 ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఇప్పటికే కోచ్ గా ఉన్న జయవర్ధనేకు ప్రమోషన్ ఇచ్చి కొత్త కోచ్ ను పిలిపించుకుంది.  ఇక ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా ఇలాంటి బాటలోనే నడిచింది అనేది తెలుస్తుంది. కోచ్గా వ్యవహరిస్తున్న అనిల్ కుంబ్లేను పీకిపారేసి అతని స్థానంలో ప్రధాన కోచ్గా ట్రెవర్ బెలీస్ ను నియమిస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ధ్రువీకరించింది. ఈయన కోచ్గా ఉన్న సమయంలోనే ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు 2019 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. అలాగే రెండు సార్లు ఐపీఎల్, ఒకసారి సిడ్నీ సిక్సస్ జట్టుకు టైటిల్ అందించిన అనుభవం కూడా అతనికి ఉంది.

 కాగా ప్రధాన కోచ్ పదవి రావడం పై స్పందించిన ట్రెవర్ బెలీస్.. పంజాబ్ జట్టుకు కోచ్గా బాధ్యతలు స్వీకరించడం పట్ల గౌరవంగా భావిస్తున్నాను. విజయం కోసం నిరంతరం కష్టపడే ప్రాంచైజీ పంజాబ్కింగ్స్.  ప్రతిభావంతులైన ఆటగాళ్ళతో  పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తెలిపాడు. కాగా మూడేళ్లుగా పంజాబ్ కింగ్స్ జట్టు కోచ్ గా ఉన్నాడు అనిల్ కుంబ్లే. అయితే అతని కోచింగ్ లో ఒక్కసారి కూడా పంజాబ్కింగ్స్ మెరుగైన ప్రదర్శన చేయలేదు. దీంతో పంజాబ్ ఫ్రాంచైజీ అతని కాంట్రాక్టును పునరుద్ధరించ లేదు. 2020లో చివరి స్థానంలో 2021లో ఐదో స్థానంలో 2022 ఎడిషన్ లో ఆరో స్థానంలో పంజాబ్కింగ్స్ నిలిచింది. ఒక్కసారి కూడా టాప్ 4 లో చోటు దక్కించుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: