వావ్.. సంజు శాంసన్ అభిమానులకి గుడ్ న్యూస్?

praveen
గత కొంతకాలం నుంచి సంజు శాంసన్  కోసం అభిమానులు అందరూ కూడా తీవ్ర స్థాయిలో నిరాశలో మునిగిపోయిన విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన సంజు శాంసన్  టీమిండియాలో  అవకాశం దక్కించుకున్నాడు. ఇండియాలో కూడా తనదైన ఆటతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సంజూ శాంసన్ కు ఆస్ట్రేలియా వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ లో చోటు దక్కడం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే తమ అభిమాన క్రికెట్ వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాడు అని భావించారు. కానీ అందరి అంచనాలు తారుమారయ్యాయి.

 వరల్డ్ కప్ ఆడబోయిన 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇందులో సంజూ శాంసన్ పేరు లేకపోవడం గమనార్హం. దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. సంజు శాంసన్  విషయంలో బిసిసిఐ సెలెక్టర్లు వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సంజు శాంసన్  ని సెలెక్ట్ చేయకపోవడానికి కారణం ఏంటో చెప్పాలి అంటూ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ పై ప్రశ్నల వర్షం కురిపించారు అని చెప్పాలి. సంజు శాంసన్ ను వరల్డ్కప్లో అని చూడలేకపోతున్నాం నిరాశలో ఉన్నారు.

 ఇలాంటి సమయంలో ఇక సంజూ శాంసన్ అభిమానులందరికీ కూడా బీసీసీఐ ఒక శుభవార్త చెప్పింది అని చెప్పాలి   మరికొన్ని రోజుల్లో సంజు శాంసన్  టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ ఏ జట్టు టీమ్ ఇండియా ఏ జట్టుతో ఈ వన్డే సిరీస్ ఆడబోతుంది.  ఈ సిరీస్ కోసం  సంజు శాంసన్ ను టీమిండియా జట్టు కెప్టెన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. కాగా ఇందులో  పృథ్వీ షా, ఈశ్వరన్, పృథ్విరాజ్, త్రిపాటి,  భరత్ కుమార్, కుల్దీప్ యాదవ్, షాబాజ్ అహ్మఫ్, రాహుల్ చాహర్, తిలక్ వర్మ  ఉమ్రాన్ మాలిక్ లాంటి క్రికెటర్లు ఉన్నారు. గత అభిమాన క్రికెటర్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు అని తెలిసి అందరూ ఆనందంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: