కోహ్లీ రిటైర్మెంట్కు.. ఇదే సరైన సమయం?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొంత కాలం నుంచి పేలవమైన  ఫామ్ తో ఇబ్బంది పడ్డాడు. సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లీ దాదాపు మూడేళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు.  ఇటీవలే ముగిసిన ఆసియా కప్లో మాత్రం విరాట్ కోహ్లీ మళ్లీ తన బ్యాట్ జులిపించి ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించాడు అన్న విషయం తెలిసిందే. కాగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అయితే ఓపెనర్గా బరిలోకి దిగి సెంచరీతో చెలరేగి పోయాడు. 61 బంతుల్లో 122 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.  కెరియర్ లోనే  71వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ టీ20 ఫార్మాట్ లో మొదటి సెంచరీ రికార్డును అందుకున్నాడు.

 విరాట్ కోహ్లీ మునుపటి ఫామ్ లోకి రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టి20 ప్రపంచకప్కు ముందు ఇది టీమిండియాకు ఎంతో గొప్ప గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే కోహ్లీ ఇలా ఫామ్లోకి వచ్చిన సమయంలో ఎవరైనా అతని రిటైర్మెంట్ గురించి మాట్లాడతారా.. ఇక్కడ మాత్రం ఒక మాజీ క్రికెటర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఎప్పుడూ  అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తే ఎంతో గౌరవంగా ఉంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు షాహిద్ అఫ్రిది. పేలవ ఫామ్ తో  ఆటకు రిటైర్మెంట్ ఇస్తే ఎవరు గుర్తించరు. అలా కాకుండా కెరియర్ లో పీక్ స్టేజిలో ఉన్నప్పుడే అంతర్జాతీయ క్రికెట్ కు కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తే ఆ ఆటగాడికి గౌరవం ఉంటుంది అంటూ వ్యాఖ్యానించాడు. ఇలాంటివి కేవలం కొంత మంది ఆటగాళ్లు మాత్రమే చేస్తారు. అందులో విరాట్ కోహ్లీ కూడా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఆసియా ఖండం నుంచి ఆడుతున్న క్రికెటర్లు ఎక్కువగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కోహ్లీ కూడా ఇదే చేస్తాడని అనుకుంటున్న అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు షాహిద్ అఫ్రిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: