క్రికెట్ చరిత్రలో తొలిసారి.. జింబాబ్వే ప్లేయర్ కు అరుదైన గౌరవం?

praveen
సాధారణంగా జింబాబ్వే హాంకాంగ్ లాంటి పసికూన  జట్లు క్రికెట్ లో పెద్దగా గుర్తింపు సంపాదించుకోవు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆటగాళ్ల ప్రతిభను గుర్తిస్తూ అందించే అవార్డులు ఇలాంటి పసికూన  జట్టులో కొనసాగుతోన్న ఆటగాళ్లకు వరించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే అప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజ జట్లుగా ఉన్న టీం లలో సభ్యులుగా ఉన్నవారు పాపులారిటీ సంపాదించుకోవడం బాగా రాణించడం నేపథ్యంలో వారికి అవార్డులు దక్కుతూ  ఉంటాయి.. కానీ ఇప్పుడు మాత్రం అలా జరగలేదు.

 ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును తొలిసారిగా ఒక జింబాబ్వే ప్లేయర్ దక్కించుకోవడం గమనార్హం. ఐసీసీ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రాజా ఈ అరుదైన రికార్డు సాధించాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రేసులో ఉన్న ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ న్యూజిలాండ్కు చెందిన మిచెల్ సంట్నర్ లను ఓడించి మరి అతను ఆగస్టు నెల కు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం గమనార్హం.  ఆగస్టు నెలలో అతడు 3 వన్డే సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే.. తద్వారా అతని ప్రదర్శనకు మెచ్చిన ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఇచ్చి సత్కరించింది అని తెలుస్తోంది..

 అయితే తనకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు సికిందర్ రాజా. ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అంటూ తెలిపాడు. ఇక ఇలా ఐసీసీ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి జింబాబ్వే ప్లేయర్ నేను కావడం మరింత గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. గత నాలుగు నెలలుగా మా జట్టు సిబ్బందికి నాకు సపోర్ట్ గా నిలిచిన సహచరులకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అందరు నా వెన్నంటే ఉండటంవల్ల ఈ అవార్డు దక్కింది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: