అతనో గోల్డెన్ డక్ ప్లేయర్.. పాక్ క్రికెటర్ పై ట్రోల్స్?

praveen
సాధారణంగా ప్రతి బ్యాట్స్మెన్ కూడా మ్యాచ్ లో ఒకసారి బరిలోకి దిగిన తర్వాత భారీగా పరుగులు చేయాలి అని భావిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులు కొల్లగొట్టాలని అని అనుకుంటూ ఉంటాడు.  కానీ కొంతమంది విషయంలో మాత్రం ఇదంతా తారుమారు అవుతూ ఉంటుంది. భారీగా పరుగులు చేయాలి అనే ఆలోచనతోనే అటు మైదానంలోకి వచ్చినప్పటికీ పరుగుల ఖాతా తెరవకుండానే గోల్డెన్ డక్  గా వెనుదిరగడం లాంటి ఘటనలు ఆటగాళ్ళ కి ఊహించని షాక్ ఇస్తూ ఉంటాయి అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాళ్లు భారీగా పరుగులు చేస్తూ సెంచరీలు హాఫ్ సెంచరీల విషయంలో రికార్డులు సృష్టిస్తూ ఉంటే... మరి కొంత మంది ఆటగాళ్లు మాత్రం  చెత్త రికార్డులు నమోదు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా కొంత మంది ఆటగాళ్లు గోల్డెన్ డక్స్ విషయంలో కూడా చెత్త రికార్డులను ఖాతాలో వేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక పాకిస్థాన్ క్రికెటర్ ఫకర్ జమాని కూడా గోల్డెన్ డక్స్ విషయంలో ఇలాగే వ్యవహరించాడు. క్రికెట్ అన్న తర్వాత ప్రతీ బ్యాట్స్మెన్ కూడా ఎప్పుడో ఒకసారి గోల్డెన్ డక్ గా  వికెట్ కోల్పోవడం సహజమే. దీంట్లో కొత్త ఏముంది అని అనుకుంటున్నారు కదా..

 అయితే అతను తన కెరీర్ లో మొదటి బంతికే గోల్డెన్ డక్ గా పెవీలియన్ చేరడం ఇది ఐదో సారి కావడం గమనార్హం. ఇక ఇప్పటి వరకు అతను గోల్డెన్ డక్ గా  వెనుదిరిగిన ఘటనలు మొత్తం టి20 ఫార్మాట్ లోనే జరిగాయి. 2019 లో శ్రీలంక తో మ్యాచ్ జరిగిన సమయంలో గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు.  ఆ తర్వాత ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాగే జరిగింది. 2021లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో కూడా మరోసారి గోల్డెన్ డక్ అయ్యాడు. ఇక ఈ ఏడాది మళ్లీ ఆస్ట్రేలియా శ్రీలంకతో మ్యాచ్లో కూడా మరో రెండుసార్లు గోల్డెన్ డక్ గా  వెనుదిరగడం గమనార్హం. ఈ క్రమంలోనే అతని పాక్ గోల్డెన్ ప్లేయర్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: