క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉండి.. ఇలాంటి ప్రవర్తన ఏంటో?

praveen
సాధారణంగా క్రికెట్ అన్న తర్వాత గెలుపు ఓటములు సహజం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గెలుపు వచ్చినప్పుడు ఆటగాళ్లు మురిసిపోకుండా.. ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకుండా ఇక తాము మంచి క్రికెట్ ఆడుతున్నాము అనే భావనతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే ఆటగాళ్లే ఇలా ఉన్నప్పుడు క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎంతో హుందాగా నడుచుకోవాల్సి ఉంటుందో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ని చూస్తే అర్థమవుతుంది. లోపల ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కూడా బయటకు ఎంతో హుందాగా కూల్గా కనిపిస్తూ ఉంటాడు. టీమిండియా గెలిచినా ఓడినా కూడా ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు అని చెప్పాలి.

 అయితే ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న రమిజ్ రాజా మాత్రం అనుచిత వ్యాఖ్యలతో ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇటీవలే ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓటమి బాధని తట్టుకోలేక ఏకంగా జర్నలిస్టులపై తన అసహనాన్ని ప్రదర్శించాడు రమిజ్ రాజా. దుబాయ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో  శ్రీలంక పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో శ్రీలంక ఘన విజయం సాధించింది అని చెప్పాలి. మ్యాచ్ అనంతరం రమిజ్ రాజాను చూసిన మీడియా ప్రతినిధులు అతన్ని పలకరించారు.

 ఈ సందర్భంగా రోహిత్  అనే జర్నలిస్టు ఈ ఓటమి కారణంగా పాకిస్తాన్ అభిమానులు నిరాశ చెంది ఉంటారు కదా అని ప్రశ్నించగా.. బహుశా మీరు భారత్కు చెందిన వారు అనుకుంటా.. పాకిస్తాన్ ఓడిపోవడంతో మీరు చాలా సంతోషంగా ఉన్నట్లు ఉన్నారు కదా అని సెటైరికల్ సమాధానం ఇస్తూ అసహనం వ్యక్తం చేశాడు రమిజ్ రాజా. అంతేకాకుండా జర్నలిస్టు మీదికి వస్తు ఆయన ఫోన్ కూడా లాక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ   చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. అతని ప్రవర్తన పై నెటిజన్లు చివాట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: