పాకిస్తాన్ ఓటమికి అతడే బాధ్యుడు ?

VAMSI
నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ఆసియా కప్ టోర్నీ ముగిసింది. టోర్నీ మొదటి రౌండ్ లో ఊహించిన విధంగా జరిగిన రెండవ రౌండ్ లో మాత్రం ప్రేక్షకులకు షాక్ ల మీద షాక్ లు ఇచ్చింది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు మరోసారి విజేతగా నిలిచేది టీం ఇండియా అని అంతా అనుకున్నారు. కానీ ఇండియా అత్యుత్సాహం వలన కనీసం ఫైనల్ కూడా చేరకుండానే మధ్యలోనే నిష్క్రమించింది. దీనితో ఆసియా కప్ టైటిల్ పోరు శ్రీలంక మరియు పాకిస్థాన్ ల మధ్యన జరిగింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న జట్లే ఎక్కువగా గెలిచాయి. ఆ ధైర్యంతోనే పాకిస్తాన్ కూడా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది.
మొదటి పది ఓవర్లు శ్రీలంకకు చుక్కలు చూపించింది. లంక కేవలం 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఆ దశలో రాజపక్స తో (71) హాసరంగా (36) కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. నిర్ణీత ఓవర్ లలో 170 పరుగులు చేసి పాక్ ముందు కఠినమైన లక్ష్యాన్ని ఉంచింది. కానీ పాకిస్తాన్ ఇన్నింగ్స్ మాత్రం నత్త నడకన సాగింది. శ్రీలంక లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ ముందు పరుగులు రావడమే కష్టంగా మారింది. చివరికి 150 పరుగులకు ఆల్ అవుట్ అయింది. మరోసారి కీపర్ రిజ్వాన్ మాత్రమే అర్ద సెంచరీ సాధించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరెవ్వరూ తనకు మద్దతు ఇవ్వడంలో సహాయపడలేదు. కాగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అయితే ఈ ఆసియా కప్ లో మరో ఫెయిల్యూర్ ఇన్నింగ్స్ ఆడి పాకిస్తాన్ ఆసియా కప్ పోగొట్టుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.  
ఈ టోర్నీ ముందు వరకు వ్యక్తిగత ప్రదర్శన చాలా బాగున్నప్పటికీ, ఇందులో రాణించలేకపోయాడు. బాబర్ ఆడిన ఆరు మ్యాచ్ లలో కేవలం 64 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో పదిహేను పరుగులు పైగా చేసింది ఒక్క మ్యాచ్ లో మాత్రమే. ఒక వరల్డ్ క్లాస్ బ్యాట్స్మన్ ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఇంత చెత్త ప్రదర్శన చేస్తారా అంటూ విమర్శలు చేస్తున్నారు. రిజ్వాన్ కు జతగా బాబర్ కనీసం మరికొన్ని పరుగులు చేసున్నా పరిస్థితి మరోలా ఉండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఒక బ్యాట్సమన్ గా మరియు జట్టు కెప్టెన్ గా బాబర్ ఈ ఓటమికి ప్రధాన కారణం మరియు బాద్యుడు అని చెప్పుకోక తప్పదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: