ఇదేం చలానా సారూ.. ఎందుకు ఫైన్ వేసారో తెలుసా?

praveen
ఒకప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారినీ పోలీసులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు భారీగా జరిమానాలు విధిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ చేతిలో కెమెరాలు పట్టుకుని నిలబడి ఉన్నా పోలీసులు ఫోటోగ్రాఫర్ల అంటే బాగా బైక్ నెంబర్ ప్లేట్ ల ని ఫోటోలు తీస్తూ ఇక ఆన్లైన్లో చలానాలు విధిస్తూ ఇంటికే రిసిప్ట్ పంపిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వెరసి నేటి రోజుల్లో వాహనదారులు బయటికి వెళ్లారు అంటే చాలు రోడ్డు నిబంధనలు పాటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి.

 నిబంధనలు పాటించకుండా జేబు గుల్ల చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు.  అయితే అటు వాహనదారులు రోడ్డు నిబంధనలు ఉల్లంఘించినప్పుడు చలాన్ వేస్తే బాగానే ఉంటుంది. కాని కొన్నిసార్లు మాత్రం ఎంతో మంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. సినిమాల్లో లాగానే కార్లో వెళుతున్న వ్యక్తికి హెల్మెట్ లేదని బైక్పై వెళ్తున్న వ్యక్తికి సీటు బెల్టు లేదని జరిమానా విధించడం లాంటి ఘటనలు కూడా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.. ఇప్పుడు ఇలాంటి తరహా ఒక వింతైన ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 కాలుష్యరహిత ఎతర్ 450x బైక్ కి ట్రాఫిక్ పోలీసులు చలనా వేశారు. ఎందుకో తెలుసా పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు అన్న కారణంతో. బైక్ పొల్యూషన్ రహిత వాహనం అని ఆకుపచ్చ లైసెన్స్ ప్లేట్ కనిపిస్తూనే ఉంది. బైక్ ఏ మాత్రం ఉద్గారాలను విడుదల చేయదు  అన్న విషయం కూడా అందరికీ తెలుసు. కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా జరిమానా వేయడం గమనార్హం. కేరళలోని మల్లపురం లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మోటారు వాహనాల చట్టం 1988 లోని సెక్షన్213 (5 ) (ఇ)కింద జరిమాన వేసినట్లు  పోలీసులు తెలిపారు.

 ఇక  పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు అని జరిమానా విధించడంతో సదరు వాహనదారులు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యాడు అని చెప్పాలి.  ఇందుకు సంబంధించిన రిశీప్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో డివిజన్లు అవాక్కవుతున్నారు. పోలీస్ లకి టార్గెట్ ఉన్నట్లు ఉంది. అందుకే కనిపించిన ప్రతి వాహనానికి ఫైన్ వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే నడుచుకుంటూ వెళుతున్న కూడా ఫైన్ వేసేలా ఉన్నారు ఈ పోలీసులు అంటూ ఎంతో మంది నెటిజన్లు సెటైరికల్ కామెంట్లు కూడా చేస్తూ ఉండటం గమనార్హం.  ఏది ఏమైనా ఈ ఘటన మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: