వీడ్కోలు: ఇండియాకు ఘన విజయం కావలెను !

VAMSI
ఆసియా కప్ లో ఇండియా ప్రయాణానికి నిన్ననే బ్రేకులు పడ్డాయి. కానీ ఇవాళ షెడ్యూల్ పరంగా నామమాత్రంగా చివరి మ్యాచ్ ను ఆఫ్ఘనిస్తాన్ తో ఆడనుంది. ఈ రెండు టీం లు అధికారికంగా నిన్న జరిగిన మ్యాచ్ తో ఆసియా కప్ ఫైనల్ కు అర్హత సాధించడంలో విఫలం అయ్యాయి. కాగా ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఇరు జట్లు కూడా గెలుపుతో సీజన్ ను ముగించాలని ఆశిస్తున్నారు. కానీ ఇక్కడ ఆశిస్తే అన్నీ జరిగిపోవు కాబట్టి...మంచి ప్రదర్శన చేస్తేనే మ్యాచ్ లు గెలవగలరు. టీం ఇండియా ఫేవరెట్ గా బరిలోకి దిగి ఇంత దారుణమైన ప్రదర్శన కనబరచడానికి కారణం ఏమిటి అంటూ అందరూ అవాక్కవుతున్నారు.
ఆఫ్ఘన్ తో మ్యాచ్ గెలుస్తుందా అంటే ఎటువంటి సందేహం లేదు. కానీ అలాంటి ఇలాంటి విజయం కాదు. ఆసియా కప్ లో కానీ వినీ ఎరుగని విధంగా ఇండియా ఆటగాళ్లు రెచ్చిపోయి ఆది చరిత్ర సృష్టించాలని అభిమానులు అంతా కోరుకుంటున్నారు. అలా అయినా ఘనంగా ఈ ఆసియా కప్ చేదు జ్ఞాపకాల నుండి బయటపడవచ్చు అనుకుంటున్నారు. అయితే గత రాత్రి ఆఫ్ఘనిస్తాన్ ఆడిన తీరు కనుక చూస్తే, ఇండియా ను కూడా ఇబ్బంది పెడుతుంది అని తెలుస్తోంది. బ్యాటింగ్ లో పూర్తిగా తేలిపోయిన ఆఫ్ఘన్.. బౌలింగ్ లో మాత్రం తమ ప్రతాపాన్ని చూపించింది. పాక్ లాంటి బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన జట్టును వణికించింది.
ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు ఇద్దరూ మరియు రషీద్ ఖాన్ లు పాక్ ను బెంబేలెత్తించారు. ఇక ఈ మ్యాచ్ లోనూ టాస్ గెలిచిన జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి రోహిత్ సేన ఈ మ్యాచ్ లో గర్జించి ఘానా విజయాన్ని నమోదు చేసి అభిమానులను ఖుషీ చేస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: