ఆసియా కప్.. టీమ్ ఇండియా ఫైనల్ వెళ్లేందుకు మరో ఛాన్స్?

praveen
ఆసియా కప్ లో భాగంగా టీమిండియా ప్రస్థానం ముగిసింది అని ప్రస్తుతం అందరూ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి సూపర్ 4లో అడుగుపెట్టింది. అయితే లీగ్ మ్యాచ్లో రాణించిన టీమిండియా  సూపర్ 4  లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో సూపర్ 4 లో మాత్రం పేలవమైన ప్రదర్శన చేసి వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. పాకిస్థాన్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన తీవ్రంగా నిరాశపరిచిన టీం ఇండియా.. ఇటీవలే ఫైనల్ కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కూడా శ్రీలంక చేతిలో ఆరు వికెట్ల తేడాతో మరోసారి పరాజయం పాలయింది.

 దీంతో టీమిండియా అభిమానులందరూ కూడా నిరాశ లో మునిగిపోయారు అని చెప్పాలి. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఆసియా కప్ గెలుస్తుందని అనుకుంటే ఇక ఇప్పుడు ఫైనల్ లో కూడా అడుగు పెట్టలేక పోతుంది అని అనుకుంటున్నారు. అయితే శ్రీలంకపై ఓటమితో టీమిండియా ఫైనల్ కు వెళ్లే అవకాశాలు దాదాపు కనుమరుగు అయినట్లే.. దీంతో టీమిండియా ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పటికి కూడా భారత్ ఫైనల్ కు వెళ్లేందుకు మరో ఛాన్స్ ఉంది అన్నది మాత్రం తెలుస్తుంది.

 అయితే అది టీమిండియా ప్రదర్శన మీద ఆధారపడి లేదు. మిగతా జట్ల మధ్య జరగబోయే మిగితా మ్యాచ్ల ఫలితాల మీద ఆధారపడి ఉంది అని తెలుస్తుంది. పాకిస్థాన్ జట్టు నేడు ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది.. ఇక శుక్రవారం శ్రీలంకతో కూడా మ్యాచ్ ఆడుతుంది. అయితే పాకిస్థాన్ జట్టు ఆఫ్ఘనిస్తాన్,శ్రీలంక చేతిలో ఓడిపోవాలి.. అలాగే టీమ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ పై భారీ తేడాతో విజయం సాధించాలీ. అప్పుడు భారత్ పాకిస్థాన్ ఆప్ఘనిస్థాన్ రెండేసి పాయింట్లతో సమానంగా ఉంటాయి.  అయితే ఇంత జరిగిన తర్వాత కూడా పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ కంటే టీమిండియాకు రన్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా జరగడం అసాధ్యం.  కానీ ఇండియాకు ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ మాత్రం ఇదొక్కటే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: