నమ్మకం లేకపోతే.. అతన్ని జట్టులోకి ఎందుకు తీసుకున్నారు : కోహ్లీ కోచ్

praveen
ఇటీవల పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భాగంగా జట్టులో ఎన్నో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి అన్న విషయం తెలిసిందే. భారీగా పరుగులు సమర్పించుకున్నారు ఆవేష్ ఖాన్  పక్కన పెట్టేశారు జట్టు యాజమాన్యం. అతను తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు అంటూ చెప్పారు. అంతేకాదు సూపర్ ఫినిషర్ గా పేరు సంపాదించుకున్న దినేష్ కార్తీక్ ను కూడా పక్కన పెట్టేశారు అన్న విషయం తెలిసిందే. కాగా మొన్నటి వరకు కేవలం బెంచ్ కు మాత్రమే పరిమితం చేసిన దీపక్ హుడాను తుది జట్టులోకి తీసుకువచ్చారు. ఆల్ రౌండర్ అయిన దీపక్ హుడా ను కేవలం బ్యాటింగ్లో మాత్రమే వాడుకున్నారు అని చెప్పాలి.

 అయితే దీపక్ హుడాకు బౌలింగ్ ఇవ్వకపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్  రాజ్ కుమార్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్ గా దీపక్ హుడానూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఉపయోగించుకొని ఉంటే బాగుండేది. క్రికెట్లో బౌలింగ్ చేసిన అనుభవం ఉన్న అతడు సిక్సర్లు ఫోర్లతో విరుచుకుపడుతున్న నవాజ్  ను ఇబ్బంది పెట్టే విధంగా బౌలింగ్  చేసేవాడు.  రోహిత్ కు అతనిపై నమ్మకం లేదు అందుకే ఆరో బౌలర్గా  ఎంపిక చేసినప్పటికీ అతనితో బౌలింగ్ వేయించడం విషయంలో పరిగణలోకి తీసుకోలేదు. నవాజ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతనితో రెండు ఓవర్లు వేయించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది..

 లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్ మన్ కి అతని ఉపయోగిస్తే బాగుండేది.. కానీ అతనిపై  రోహిత్ కి నమ్మకం లేదు అన్న విషయం అతని వాడుకోకపోవడం ద్వారా తెలిసిపోయింది. అయితే నవాజ్ ఇన్నింగ్స్ పాకిస్తాన్ కి ఎంతో ఉపయోగపడింది. 20 బంతుల్లో 42 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అయితే దీపక్ హుడా పై అంత నమ్మకం లేనప్పుడు ఇక తుది జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారు అంటూ ప్రశ్నించాడు రాజ్ కుమార్ శర్మ. అంతేకాదు జట్టులో ముగ్గురు సీమర్లు మాత్రమే ఉండాలని టీం మేనేజ్మెంట్ నిర్ణయాన్ని కూడా తప్పుపట్టాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: