శ్రీలంకతో మ్యాచ్.. టీమిండియాకు పుజారా సలహా?

praveen
గత కొన్ని రోజుల నుంచి టీమిండియాలో బ్యాటింగ్ లైనప్ విషయంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఏ స్థానంలో ఎవరు బ్యాటింగ్ కు వస్తారు అన్నది కూడా ఊహకందని విధంగా మారిపోయింది. ఈ క్రమంలోనే అటు ప్రేక్షకుల్లో కూడా పూర్తిస్థాయి కన్ఫ్యూషన్ ఏర్పడింది. అయితే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్న వారు కొన్ని కొన్ని సార్లు ఓపెనర్లుగా కూడా బరిలోకి దిగడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ సర్వత్ర చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి.

 ఇటీవల ఇదే విషయంపై భారత టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పుజారా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ వర్కౌట్ కావట్లేదు అంటూ వ్యాఖ్యానించాడు. జట్టులోకి అక్షర్ పటేల్  తో పాటు మరో ఫేసర్ రావాలని పూజారా అభిప్రాయం వ్యక్తం చేశాడు. రవీంద్ర జడేజా దూరం కావడంతో సరైన తుది జట్టును ఎంపిక చేయడం విషయంలో కాస్త గందరగోళానికి గురి అవుతుంది టీమిండియా మేనేజ్మెంట్ అంటూ తెలిపాడు. గత కొన్ని నెలలుగా ఇషాన్ కిషన్ రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ దీపక్ హుడాలను ఓపెనర్ లుగా ఉపయోగిస్తున్నారు.

 వీరిలో సూర్యకుమార్ యాదవ్ మినహా మిగతా ఆటగాళ్లు అందరూ కూడా జట్టులో ఉండే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఇక ఇషాన్ కిషన్ ఆసియాకప్ కి కూడా ఎంపిక కాలేదు. ఇక రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆవేశ్ ఖాన్ జ్వరం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగిన పోరులో అక్షర్ పటేల్ ను జట్టులోకి తీసుకుంటారా అని పూజారాను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అడుగగా.. దీనిపై స్పందిస్తూ ప్రస్తుత బ్యాటింగ్  కాంబినేషన్ పనిచేయడం లేదని.. మరో బౌలర్ ఆల్రౌండర్ కావాలని కోరుకుంటున్నట్లు పూజారా చెప్పుకొచ్చాడు. జట్టులో మూడో సీమర్ ను ఉపయోగించాలని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తున్నప్పటికీ ఫేస్ ఆల్ రౌండర్ ని పూర్తికోట బౌలింగ్ చేసేలా ప్రతిసారి ఉపయోగించలేమని ఛటేశ్వర్ పూజార చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: