ఆ రోజే నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నా : కోహ్లీ

praveen
గత కొంత కాలం నుంచి పేలవమైన ప్రదర్శనతో తీవ్రస్థాయిలో నిరాశపరుస్తున్నా విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో మాత్రం మళ్లీ ఫాంలోకి వచ్చినట్లు కనిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. కొన్నాళ్లు విశ్రాంతి తర్వాత ఆసియా కప్లో టీమిండియాలో చేరిన విరాట్ కోహ్లీ తమదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ భారీగా పరుగులు చేస్తూ ఉన్నాడు. మూడు మ్యాచ్లలో రెండు సెంచరీలు చేసి రెండుసార్లు టీమిండియా తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు అని చెప్పాలి. అంతే కాదు మూడు మ్యాచ్ లలో కలిపి ఇక  154 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా ఉన్నాడు.
 దీంతో విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చాడు అంటూ అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతున్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలో కోహ్లీ ఇటీవలే తనపై విమర్శలు చేసిన వారిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. టీవీ ఛానళ్లలో సలహాలు ఇవ్వడం కాదని వ్యక్తిగతంగా మాట్లాడి సలహాలు ఇస్తే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. ధోని ఒక్కడే తనకు పర్సనల్గా మెసేజ్ చేసి సలహాలు ఇచ్చాడు అంటూ తెలిపాడు విరాట్ కోహ్లీ. ఇక ఇదే సమయంలో యంగ్ బౌలర్ అర్ష దీప్ సింగ్ చేసిన క్యాచ్ మిస్ పై కూడా ఇటీవల స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అతను క్యాచ్ మిస్ చేయడం వల్ల టీమిండియా ఓడిపోయింది అంటూ ఎంతో మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ సమయంలోనే ఈ విషయంపై స్పందించిన విరాట్ కోహ్లీ ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు తప్పు చేస్తారని ఇలాంటివి క్రికెట్లో సర్వసాధారణం అంటూ తెలిపాడు. ఇందుకు తాను కూడా అతీతుడిని కాదు అంటూ తెలిపాడు. 2009 చాంపియన్స్ ట్రోఫీ తన మొదటి మ్యాచ్ లోనే పాకిస్థాన్ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది బౌలింగ్లో చెత్త షాట్ ఆడి వికెట్ కోల్పోయాను. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. ఇక ఆరోజే నా కెరీర్ ముగిసిపోయింది అని అనుకున్నాను అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: