ఇండియా 36 పరుగులకు ఆలౌట్.. పగటి కలలొద్దంటున్న ఫ్యాన్స్?

praveen
భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు  ఉత్కంఠ ఏ రేంజిలో ఉంటుందో క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి మరి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. అయితే అటు మైదానంలో క్రికెట్ ఆడుతున్న వారు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి ఒక సాదాసీదా మ్యాచ్ గానే చూసినప్పటికీ అటు ప్రేక్షకులు మాత్రం దాయాదుల పోరు లో విజయం గౌరవంగా భావిస్తూ ఉంటారు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే తమ జట్టుకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ఎన్నోరకాల పోస్టులు పెట్టడం వంటివి కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 ఇప్పటికే ఆసియా కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు పైసా వసూల్ మ్యాచ్ మారిపోయింది. కాగా నేడు మరో  సారి దాయాదుల పోరు  జరగబోతోంది. ఇలాంటి సమయంలోనే ఇక పాకిస్తాన్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులతో రెచ్చి పోతూ ఉండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఇటీవల హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్లో  పాకిస్తాన్ జట్టు మంచి ప్రదర్శన చేసింది. కేవలం 38 పరుగులకే ఆలౌట్ చేసి ఘన విజయాన్ని అందుకుంది.

 ఇక ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఇప్పుడు టీమిండియాతో మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు   ఎలా రాణిస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. దీంతో నేడు జరగబోయే మ్యాచ్ పై  మరింత ఉత్కంఠ  పెరిగిపోయింది.  అయితే ఇప్పటికే భారత్ జట్టులో  ఓడిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతుండటం గమనార్హం. హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ బౌలర్లు చెలరేగడంతో ఈ జట్టు  38 పరుగులకు ఆలౌటైంది. కాగా ఇదే  ప్రదర్శనను పాకిస్థాన్  భారత్పై కూడా చేసి చూపిస్తారని ఊహించుకోండి.. ఫలితం కనిపిస్తుంది.. టీమిండియా కేవలం 36పరుగులకే ఆలౌట్ అయ్యి దారుణ పరాజయం మూటగట్టుకుంది అంటూ ఒక ట్వీట్ చేశాడు. దీంతో అతన్ని భారత ఫాన్స్ అందరు కూడా  పగటి కల లో నుంచి బయటికి రా అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: