ఊరించి ఊరించి.. షాక్ ఇచ్చిన సౌరవ్ గంగూలీ?

praveen
ప్రస్తుతం టీమిండియా క్రికెట్ హిస్టరీలో దిగ్గజ క్రికెటర్ల గురించి మాట్లాడుకోవాలి వస్తే అందులో ప్రస్తుతం బిసిసిఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సౌరవ్ గంగూలీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన సౌరవ్ గంగూలీ దిగ్గజ క్రికెటర్ గా ఎదిగాడు.  తనకు తిరుగు లేదు అని నిరూపించాడు. అంతేకాదు టీమిండియాకు సరికొత్త దూకుడు నేర్పాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇప్పుడు బీసీసీఐ  అధ్యక్షుడి హోదాలో అటు భారత క్రికెట్కు ప్రపంచవ్యాప్తంగా మరింత పేరుప్రఖ్యాతలు  తెచ్చి పెడుతూ  ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాడు.

  అయితే సౌరవ్ గంగూలీ రిటైర్మెంట్ ప్రకటించిన ఎన్నో ఏళ్ళ తరువాత ఇటీవలే మళ్లీ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగబోతున్నా అని ప్రకటించాడు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  ఇక పద్నాలుగేళ్ల తర్వాత మళ్లీ తన అభిమాన క్రికెటర్ బ్యాటింగ్ చూడబోతున్నామని ఎంతగానో ఎదురుచూశారు.  కానీ అందరినీ ఊరించిన సౌరవ్ గంగూలీ ఇక ఇప్పుడు నిరాశపరిచాడు అన్నది తెలుస్తుంది.  త్వరలో ప్రారంభం కాబోయే లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో పాల్గొనాలని భావించాడు. ఆజాది కా  మహోత్సవ్ కోసం ఫండ్స్ వసూలు చేసేందుకు ఓ మ్యాచ్ ఆడాలని  నిర్ణయం తీసుకున్నాడు.  భారత్ కు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావడంతో మహిళా సంక్షేమం కోసం లెజెండ్స్ క్రికెట్ లీగ్ ద్వారా నిధులు వసూలు చేయబోతున్న అంటూ సోషల్ మీడియాలో తెలిపాడు.
 మళ్లీ బ్యాటింగ్ చేయడం కోసం సిద్ధమయ్యానని ఇక అభిమానుల అందరిలో ఎన్నో ఆశలు పెంచాడు. ఇక ఇటీవలే ఊహించని షాక్ ఇచ్చాడు. లెజెండ్ క్రికెట్ లీగ్లో భాగంగా ఒక మ్యాచ్ ఆడాలి అని  అనుకున్నాను. అయితే నా ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో నిరంతరం పని కారణంగా ఇక ఇప్పుడు గేమ్ ఆడ లేక పోతున్నాను అంటూ షాకిచ్చాడు సౌరవ్ గంగూలీ. లెజెండ్స్ క్రికెట్ లీగ్ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు అని నాకు తెలుసు. నేను ఈ మ్యాచ్ ఆడకపోయినా మ్యాచ్ జరిగిన రోజు మైదానానికి వచ్చి మ్యాచ్ చూస్తాను అంటూ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: