జడేజా లేకపోయిన.. ఆ విషయంలో టీమిండియా లక్కీ?

praveen
రవీంద్ర జడేజా.. అతను జట్టులో ఉన్నాడు అంతే చాలు టీమిండియా   గెలుస్తుంది అనే నమ్మకం ఉంటుంది. అసలు సిసలైన నిఖార్సయిన ఆల్ రౌండర్ అనే పదానికి అతను ఒక నిర్వచనం అని చెప్పాలి. ఎందుకంటే కేవలం ఒక బౌలర్గా టీమిండియా లోకి ఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా ఆ తర్వాత బ్యాటింగ్ పై కూడా పట్టు సాధించాడు.  ఇప్పుడు ఒక స్పెషలిస్టు బ్యాట్స్మెన్గా టీమిండియాలో కొనసాగుతున్నాడు అని చెప్పాలి. ఇలా ఒక వైపు బౌలింగ్లో కీలకమైన సమయంలో వికెట్లు పడగొడుతూ  ఉండే రవీంద్ర జడేజా జట్టు కష్టాల్లో ఉన్న ప్రతి సారి కూడా తన బ్యాటింగ్తో మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు. సిక్సర్లు ఫోర్ల తో చెలరేగిపోతు స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ  ఉంటాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా ఉంటే జట్టు మరింత పటిష్టంగా ఉంటుంది అని చెప్పాలి. అయితే కేవలం బౌలింగ్ బ్యాటింగ్ లోనే కాదండోయ్ అటు ఫీల్డింగ్ లో కూడా తనకు తిరుగులేదు అని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించాడు రవీంద్ర జడేజా.  ఇకపోతే ఇక ఇటీవలే ఆసియా కప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. అలాంటి ఆల్రౌండర్ ఇటీవలే గాయం బారిన పడి చివరికి జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే.  మోకాలి గాయం కారణంగా ఆసియాకప్ మొత్తానికి టీమిండియాకు అందుబాటులో లేకుండా పోయాడు.

 అయితే కేవలం ఆసియా కప్ కి మాత్రమే కాదు అటు గాయం తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా లో జరిగే వరల్డ్ కప్ కు  కూడా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూరం కావడంతో పెద్ద లోటు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై స్పందిస్తూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా క్రికెటర్ వసీం జాఫర్ స్పందిస్తూ రవీంద్ర జడేజా టీమిండియా కు దూరం కావడం పెద్ద లోటే అంటూ వ్యాఖ్యానించాడు.  రవీంద్ర జడేజా ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు అద్భుతమైన ఫీల్డర్ అంటూ ప్రశంసలు కురిపించాడు. అయితే రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేసిన  అక్షర్ పటేల్ సైతం  మంచి ఆటగాడు అని ఇది టీమిండియా  అదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: