మెరుపు ఇన్నింగ్స్.. ఐసీసీ ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన హార్దిక్?

praveen
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ నాటినుంచి ఎంత అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే టీమిండియాలో చోటు దక్కించుకున్న హార్దిక్ పాండ్యా ఇక ఇక్కడ కూడా తిరుగులేని ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నాడు. జట్టు  కష్టాల్లో ఉన్న ప్రతి సారి కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ అభిమానులు అందరి చేత వావ్  అనిపిస్తున్నాడు ఈ ఆల్రౌండర్. మునుపటి ఫామ్  అందుకోవడం కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే అత్యుత్తమ ఫామ్ కనబరుస్తూ ఉన్నడు.

 ఈ క్రమంలోనే ఇటీవల ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో మరోసారి తనదైన శైలిలోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు అన్న విషయం తెలిసిందే. సిక్సర్లు  ఫోర్ లతో చెలరేగి పోయాడు.  17 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. చివర్లో తన గురువు మహేంద్ర సింగ్ ధోనీ స్టయిల్ లో  సిక్సర్లతో మ్యాచ్ ముగించి ప్రేక్షకులను ఆనందంలో ముంచేసాడు అని చెప్పాలి.  అయితే గత కొంత కాలం నుంచి టి20 ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన  హార్దిక్ పాండ్యా ఇటీవల ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో  కూడా తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్   సొంతం చేసుకున్నాడు.  ఎన్నో స్థానాలు ఎగబాకి టీ20 ఫార్మాట్ లో 5వ స్థానానికి చేరుకున్నాడు  హార్దిక్ పాండ్యా.
 ఈ మ్యాచ్ కు ముందు వరకు కూడా 13 వ స్థానంలో ఉన్న హార్దిక్ పాండ్యా..  ఎనిమిది స్థానాలు  ఎగబాకాడు. మొన్నటి వరకు రెండవ స్థానంలో కొనసాగిన టీమిండియా బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ 792 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. కాగా  810 పాయింట్లతో బాబర్  అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 796 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతూ ఉండటం గమనార్హం. ఏదిఏమైనా అటు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అత్యుత్తమ ర్యాంకు సొంతం చేసుకొవటంతో  తన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: