టీమిండియా 12మందితో ఆడింది : పాక్ మాజీ కోచ్

praveen
ఇటీవలే ఆసియా కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్  ఎంత ఉత్కంఠగా సాగిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ప్రేక్షకులను మునివేళ్ళపై నిలబెట్టిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో ఆల్ రౌండర్లు  రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా తమదైన ఇన్నింగ్స్ తో జట్టును  ఆదుకోవడం తోనే టీమిండియా విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి సంబంధించిన చర్చ  మాత్రం ఆగడం లేదు.

 ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఇక ఇదే విషయంపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చివర్లో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడి 17 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించడంపై  ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై పాకిస్థాన్ మాజీ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ మిక్కీ ఆర్థర్ కూడా స్పందించాడు. ఈక్రమంలోనే హార్దిక్ పాండ్యా ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు.. హార్దిక్ పాండ్యా జాక్వెస్ కలిస్ ను గుర్తు చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు.

 టీమిండియా 11 మంది ఆటగాళ్ళతో కాదు పన్నెండు మంది ఆటగాళ్ళతో ఆడినట్లు అనిపించింది.  హార్దిక్ పాండ్యా ఒక అద్భుతమైన ఆటగాడు. అతని  ఆటతీరుతో జాక్వెస్ కలిస్ ను గుర్తు తెచ్చాడు. నేను  దక్షిణాఫ్రికాకు ఆడిన రోజుల్లో కి తీసుకువెళ్ళాడు అంటూ చెప్పుకొచ్చాడు మికీ ఆర్థర్. నలుగురు సీమర్ లలో ల ఒకడిగా టాప్ ఫైవ్ లో బ్యాటింగ్  చేయగల సత్తా ఉన్న క్రికెటర్గా పాండ్య ఉన్నాడు.  ఒ హార్దిక్ పాండ్యా భారత జట్టుకు ఒక గొప్ప ఆస్తి. అతను జట్టులో ఉంటే ఒక అదనపు ఆటగాడిని  ఆడించిన దానితో సమానం అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో  కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ, ప్రదర్శన బాగుంది అంటూ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: