ఈ మూడు కారణాల వల్లే.. జట్టులోకి డీకేని తీసుకున్నారా?

praveen
ఆసియా కప్ లో భాగంగా ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ముగిసినప్పటికీ కూడా ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ ను ఎందుకు తీసుకోలేదు.. కీలకమైన ఆటగాడిగా ఉన్న రిషబ్ పంత్ ను పక్కన పెట్టడానికి   గల కారణాలు ఏంటి అన్నదానిపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. కానీ హర్భజన్ సింగ్ మాత్రం ఇక దినేష్ కార్తీక్ ను జట్టులోకి  తీసుకోవడాన్ని సమర్పించాడు.  దినేష్ కార్తీక్ ను జట్టులో  ఆడించడానికి మూడు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.
 స్పిన్, ఫేస్ దంచికొట్టడం :  డెత్  ఓవర్లలో కెప్టెన్ ను తరచూ పేస్ బౌలర్ ను ఉపయోగిస్తారు. అయితే దినేష్ కార్తీక్ ఎంతో సమర్థవంతంగా   ఫేస్ బౌలర్లను ఆడగలడు.  తనకి ఫేసర్ల  పై మంచి రికార్డ్  ఉంది. పేసర్లను మాత్రమే కాదు స్పిన్నర్లను  కూడా దీటుగా ఎదుర్కొంటూ భారీ షాట్లు ఆడగల సత్తా  దినేష్ కార్తీక్ సొంతం.  అందుకే అతన్ని పాకిస్తాన్తో మ్యాచ్లో వినియోగించుకున్నారు.
 ధాటిగా ఆడి గలిగే సామర్థ్యం :  దినేష్ కార్తిక్ కి ఎలాంటి ఫామ్లో ఉన్నాడో  అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న ఐపీఎల్లో ఇక ఇప్పుడు టీమిండియా తరపున కూడా మెరుపు ఇన్నింగ్స్ను ఆడుతున్నాడు.  ఇక ఈ గణాంకాలే పంత్ ను  కాదని అతనికి అవకాశం వచ్చేలా చేశాయి.
 అనుభవం :  పంత్ తో  పోల్చిచూస్తే దినేష్ కార్తీక్ కు పదేళ్ల అనుభవం ఎక్కువగా ఉంది.  2006 లో ఆడిన టీమిండియా తొలి టీ-20 మ్యాచ్ లో దినేష్ కార్తీక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్  అందుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియాకు ఫినిషర్ కావాలనే ఉద్దేశంతో డీకే కు  జట్టులో అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.
 ఈ మూడు కారణాల వల్ల అటు యువ ఆటగాడు రిషబ్ పంత్ ను  కాదని దినేష్ కార్తీక్ ను జట్టులోకి తీసుకునేలా చేశాయి అన్నది ప్రస్తుతం ఎంతో మంది విశ్లేషకులు చెబుతున్నారు.  అయితే పాకిస్థాన్తో మ్యాచ్లో తుది జట్టులో దినేష్ కార్తీక్ అవకాశం దక్కించుకున్నప్పటికి అతనికి పెద్దగా ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇక భారత్ ఆడబోయే రెండో మ్యాచ్ లో  అతన్నీ  కొనసాగిస్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk

సంబంధిత వార్తలు: