పాకిస్తాన్ తో మ్యాచ్.. జట్టులో ఆ ఇద్దరికీ నో ఛాన్స్?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు  అందరూ ఎదురుచూస్తున్న ఉత్కంఠభరితమైన హై వోల్టేజీ మ్యాచ్ నేడే జరగబోతుంది అన్నది తెలుస్తుంది. యూఏఈ వేదికగా ఇక దాయాదుల పోరు నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఈ క్రమంలోనే తమదైన వ్యూహాలతో బరిలోకి దిగేందుకు ఇరుజట్లు కూడా రెడీ అయిపోయాయి. ఇలాంటి సమయంలోనే ఎవరు గెలుస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. దాయాదుల పోరు కోసం ఇరు దేశాలు అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ ప్రేమికులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.

 ఇక గత కొంత కాలం నుంచి మంచి ప్రదర్శన చేస్తూ ఇరు జట్లు కూడా ప్రస్తుతం ఎంతో పటిష్టంగా కనిపించడంతో దాయాదుల పోరు మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే పాకిస్తాన్తో మ్యాచ్లో భారత తుది జట్టు ఎలా ఉంటుంది అనే విషయం పై ఇప్పటికే ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇటీవలే టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ తన ప్లేయింగ్ లెవెన్ జట్టును కూడా ప్రకటించాడు.

 ఇక వసీం జాఫర్ ప్రకటించిన జట్టులో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ కె.ఎల్.రాహుల్ లను ఎంపిక చేశాడు. ఇక విరాట్ కోహ్లీనీ ఎప్పటిలాగానే మూడో స్థానం కోసం ఎంపిక చేశాడు. 4,5 స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యాలను తీసుకున్నాడు. ఆరో స్థానంలో దినేష్ కార్తీక్, పంత్ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లు వసీం జాఫర్ తెలిపాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కు స్థానం కల్పించాడు. అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్న దీపక్ హుడాకు వసీం జాఫర్ పక్కన పెట్టేశాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ను కూడా జట్టులోకి తీసుకోలేదు.
పాక్‌తో మ్యాచ్‌కు జాఫర్‌  ప్లేయింగ్‌ ఎలెవన్‌ :
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్‌/ దినేష్‌ కార్తీక్‌, రవీంద్ర జడేజా,యజువేంద్ర చహల్‌, రవి బిష్ణోయి, భువనేశ్వర్‌కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: