ఆసియా కప్.. నేడే మొదటి మ్యాచ్.. గెలిచేదెవరు?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మినీ వరల్డ్ కప్ గా పిలవబడే ఆసియా కప్ నేటి నుంచే ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. అయితే ముందుగా అనుకున్న ప్రకారం శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీకి జరగాల్సి వుంది.. కాని శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రాజకీయ అనిశ్చితి కారణంగా ఇక లంక క్రికెట్ బోర్డు ఆసియా కప్ను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు  సిద్ధపడింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే నేడు తొలి మ్యాచ్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఇటీవలే జరిగిన స్థానిక టీ20 టోర్నమెంట్ లో పాల్గొని మంచి ఊపు మీద ఉన్నాయి. శ్రీలంక జట్టు కప్ గెలవడమే లక్ష్యంగా  ఆసియా కప్లో బరిలోకి దిగింది అని చెప్పాలి.

 ఇక మరోవైపు ఇటీవల ఐర్లాండ్ తో సిరీస్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్  జట్టు కనీసం ఆసియా కప్ లో మొదటి మ్యాచ్లో విజయం సాధించింది సత్తా చాటాలని భావిస్తుంది అని చెప్పాలి. కాగా ప్రస్తుతం శ్రీలంక జట్టు దాసున్ షనక సారథ్యంలో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్ విభాగంలో ప్రస్తుతం అందరు బ్యాట్స్మెన్లు అత్యుత్తమమైన ఫాంలో కొనసాగుతున్న నేపథ్యంలో పటిష్టంగా కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే స్టార్ ఫేసర్ దుష్యంత చమీరా  గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి మొత్తానికి దూరం కావడం శ్రీలంక జట్టుకు  ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఇక బౌలింగ్ విభాగంలో కరుణరత్నే తప్ప చెప్పుకోదగ్గ బౌలర్లు ఎవరూ కనిపించడం లేదు.

 ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా బ్యాటింగ్ విభాగంలో ప్రస్తుతం పటిష్టంగానే ఉంది. ఒత్తిడిని తట్టుకుని ఏ మేరకు నిలబడుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ విభాగం రషీద్ నాయకత్వంలో ముందుకు నడిచే అవకాశం ఉంది. ఇక ఒకవేళ రషీద్ ఖాన్ మ్యాజిక్ చేశాడంటే శ్రీలంక బ్యాటింగ్ విభాగాన్ని తక్కువ పరుగులకే కుప్పకూల్చటం ఖాయం అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ లో ఇరు జట్ల బలాబలాలు సమానంగా ఉన్నాయని చెప్పాలి. దీంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: