ఆసియా కప్ లో.. కేఎల్ రాహుల్ కు బదులు అతన్ని తీసుకోవాల్సింది?

praveen
ప్రస్తుతం టీమిండియాలో కె.ఎల్.రాహుల్ కీలకమైన క్రికెటర్గా కొనసాగుతున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి గాయం కారణంగా జట్టు దూరంగానే  ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే గాయం నుంచి కోలుకునీ జింబాబ్వే పర్యటనలో భాగంగా టీమిండియా లో చేరాడు. కానీ అనుకున్నంత ప్రదర్శన మాత్రం చేయలేకపోయాడు అని చెప్పాలి. దీంతో గాయం నుంచి కోలుకున్న కె.ఎల్.రాహుల్ మునుపటి ఫామ్ లోనే ఉన్నాడా లేదా అన్నది అనుమానంగా  మారిపోయింది. ఇలాంటి సమయంలోనే ఆసియా కప్ లో అవకాశం దక్కించుకున్నాడు కె.ఎల్.రాహుల్.

 ఇలాంటి సమయాల్లో ఇక ఆసియా కప్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది టీమిండియా.  అయితే ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియాలో గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ కు స్థానం కల్పించడం పై కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ఈ విషయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ స్పందించాడు.  రాహుల్ కి బదులు సంజు శాంసన్ ని ఆసియా కప్ టోర్నీకి ఎంపిక చేసి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవలే ఒక ప్రముఖ క్రికెట్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు డానిష్ కనేరియా.

 కేఎల్ రాహుల్ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అతనికి తగినంత ప్రిపరేషన్ లేకుండానే ఆసియా కప్లో బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే భారత జట్టుకు సంజూ శాంసన్ లాంటి ప్లేయర్ అందుబాటులో ఉండగా తగినంత ప్రిపరేషన్ లేని కె.ఎల్.రాహుల్ ని ఎందుకు ఎంపిక చేశారో అంటూ అభిప్రాయపడ్డాడు. సంజూ శాంసన్ అద్భుతమైన క్రికెటర్ అతని సొగసైన బ్యాటింగ్కు నేను మంత్రముగ్ధుడిని అవుతాను. అతడు జట్టులో ఉన్నట్టే ఉంటాడు కానీ ఎప్పుడూ బెంజ్ కే పరిమితం అవుతాడు. అందుకే ప్రిపరేషన్ లేని కె.ఎల్.రాహుల్ స్థానంలో సంజు శాంసన్ కి  అవకాశం వచ్చి ఉంటే బాగుండేది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: