రేపే ఆసియా కప్... బోణీ కొట్టేదెవరు ? ఎవరి బలం ఎంత ?

VAMSI
ఆసియా కప్ లో భాగంగా రేపు యూఏఈ లో దుబాయ్ వేదికగా సాయంత్రం 7.30 గంటలకు మొదటి మ్యాచ్ శ్రీలంక మరియు ఆఫ్ఘనిస్తాన్ ల మధ్యన జరగనుంది. దీనితో ఇరు జట్ల అభిమానులు గెలిచేది మా జట్టంటే మా జట్టు అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. అయితే క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న ప్రకారం రేపు మ్యాచ్ లో గెలిచే అవకాశం ఎవరికి ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. వాస్తవానికి రెండు జట్లు ఒకే స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా సీనియర్లు దూరమైన తర్వాత సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చి చాలా కాలమే అయింది. అందుకే ఆసియా కప్ లాంటి టోర్నీలో చెలరేగి ఆది టైటిల్ ను అందుకుని సత్తా చాటాలని భావిస్తోంది. ఇక ఆఫ్ఘన్ జట్టు సైతం ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక మరియు బంగ్లాదేశ్ ల కన్నా మెరుగైన ప్రదర్శన చేసి టైటిల్ ను కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇరు జట్ల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం.
శ్రీలంక: శ్రీలంక జట్టుకు ఆల్ రౌండర్ దసున్ శనక కెప్టెన్ గా ఉన్నాడు. ఇతను బౌలింగ్ మరియు బ్యాటింగ్ లలో మంచి ఫామ్ లోనే ఉన్నాడు. మరి అదే ఫామ్ ను ఈ మ్యాచ్ లో కొనసాగిస్తే గెలుపు లాంఛనమే. ఇక బ్యాటింగ్ లో గుణతిలక, రాజపక్స, అసలంక, మెడిస్ లు స్థాయికి తగిన ప్రదర్శన చేస్తే ఆఫ్ఘన్ ను ఓడించడం సులభం అవుతుంది. ఇక బౌలింగ్ లో ఫాస్ట్ కన్నా కూడా స్పిన్ బౌలింగ్ ఈ పిచ్ ల మీద కీలకం అయ్యే అవకాశం ఉంది. లంక జట్టులో హాసరంగా మరియు తీక్షణ రూపంలో నాణ్యమైన స్పిన్నర్ లు ఉన్నారు. టీ 20 లలో ఆల్ రౌండర్ లది కీలక పాత్ర అని చెప్పాలి. అలా చూసుకుంటే శ్రీలంక టీం లో చమిక కరుణరత్నే, ధనంజయ డి సిల్వా లు బాధ్యత తీసుకోవాలి. వీరికి సహకారం అందించడానికి శనక మరియు హాసరంగా లు ఉన్నారు.
ఆఫ్ఘనిస్తాన్: ఆఫ్ఘన్ టీం ఇటీవల ప్రదర్శన చూస్తే ఏమంత బాగాలేదు అనే చెప్పాలి. దీనికి ఉదాహరణే ఇటీవల ఐర్లాండ్ తో ముగిసిన సిరీస్ లో ఓటమి చెందడం. అయితే ఆఫ్ఘన్ ను ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయలేము. మహమ్మద్ నబి కెప్టెన్ గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు అని చెప్పాలి. ఇక బ్యాటింగ్ లో నజీబుల్లా జాడ్రాన్, ఒమర్ జై, హాజరథుల్లా జాజై, షాహిద్ లు రాణించాల్సిన అవసరం ఉంది. కాగా బౌలింగ్ లో నవీన్ ఉల్ హాక్, రషీద్ ఖాన్ మరియు ముజీబ్ లే కీలకం కానున్నారు.
మరి ఈ మ్యాచ్ లో దాదాపుగా గెలిచే అవకాశం శ్రీలంక జట్టుకే ఉంది. ఇక ఎప్పటిలాగే ఆ రోజు ఎవరు ఉత్తమంగా ఆడితే వారిదే విజయం.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: