ఆటగాళ్లకు జెర్సీలు కూడా లేవా.. బీసీసీఐపై సీరియస్?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ బోర్డు గా కొనసాగుతుంది బీసీసీఐ. ఎంతలా అంటే ఏకంగా ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న స్థాయికి  ఎదిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి ఎక్కువ ఫండ్స్ పంపించేది కూడా బీసీసీఐ అని చెప్పాలి. అలాంటి బిసిసిఐ ఇటీవలి కాలంలో జట్టులోని ఆటగాళ్లకూ సరైన జెర్సీలను కూడా అందుబాటులో ఉంచలేక పోతుందా  అంటే ప్రస్తుతం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో భారత ఆటగాళ్లు ఎంతోమంది తమ సహచర ఆటగాళ్ల జెర్సీలను ధరించి అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడుతూ ఉండటం గమనార్హం.

 గత నెలలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్ లో దీపక్ హుడా బౌలర్ ప్రసీద్ కృష్ణ  జెర్సీ ధరించాడు. ఇక మరో ఇద్దరు ఆటగాళ్ళు ప్లేయర్స్ కూడా అర్షదీప్ జెర్సీ ధరించి  కనిపించారు. ఇప్పుడు ఈ జాబితాలో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా వచ్చి చేరాడు అన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భాగంగా శిఖర్ ధావన్ శార్దూల్ ఠాగూర్ జెర్సీ ధరించి బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. అయితే జెర్సీ పై షార్దుల్ ఠాకూర్ పేరు  దగ్గర టేపు అతికించి ఉండటం గమనార్హం. శార్దూల్ ఠాకూర్ జెర్సీ నెంబర్ 54 మాత్రం స్పష్టంగా కనిపించింది.

 అయితే ఇలా శిఖర్ ధావన్ శార్దూల్ ఠాకూర్ జెర్సీ ధరించడానికి కారణం ఏమిటో మాత్రం ఇప్పటికీ తెలియదు.  జెర్సీ చూసి ఒక్క సారిగా ఓపెనర్గా శార్దూల్ ఠాకూర్ వచ్చాడని అనుకున్నాను. కానీ తీరా చూస్తే అది శిఖర్ ధావన్ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు అయినా బిసిసీఐ ఆటగాళ్లకు సరైన జెర్సీ ఎందుకు అందించలేక పోతుందో అర్థం కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా ఇలా జెర్సీ లకు సంబంధించిన చర్చ మాత్రం మరికొన్ని రోజుల్లో  తీవ్రం అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: