టీంఇండియా కెప్టెన్ గా శుబ్ మన్ గిల్.. బీసీసీఐ ప్రకటన?

praveen
గత కొంత కాలం నుంచి టీమిండియాలో బాగా రాణిస్తూ మంచి ఫామ్ కనబరుస్తున్న శుబ్ మన్ గిల్ మరికొన్ని రోజుల్లో టీమిండియా కెప్టెన్గా మారబోతున్నాడు. అదేంటి జట్టులో ఎంతో మంది సీనియర్ ఆటగాళ్లు ఉండగా యువ ఆటగాడు శుబ్ మన్ గిల్ కి కెప్టెన్సీ అప్పగించడం ఏంటి ఆశ్చర్యంగా ఉంది అని అనుకుంటున్నారు కదా  అయితే మీరు అనుకుంటున్నట్లుగా శుబ్ మన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేది జాతీయ టీమిండియా జట్టుకు కాదు భారత్-ఏ జట్టు కు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధమవుతున్నాడు.

 స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో మరికొన్ని రోజుల్లో నాలుగు రోజుల పాటు టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది భారత ఏ జట్టు. ఈ విషయాన్ని  బిసిసిఐ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ జట్టుకు టీమిండియా యువ ఆటగాడు శుబ్ మన్ గిల్ సారథ్య బాధ్యతలు చేపట్టి జట్టును ముందుకు నడిపించ పోతున్నాడు. బీసీసీఐ ప్రకటించిన ఈ జట్టులో హనుమ విహారి,వాషింగ్టన్ సుందర్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాగూర్ మహమ్మద్ సిరాజ్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా భాగం కావడం గమనార్హం.

 అంతేకాకుండా 2021-22 రంజీ ట్రోఫీలో భాగంగా అదరగొట్టిన యశస్వి జైస్వాల్, శ్యామ్ మూలని, సర్ఫరాజ్ ఖాన్ యష్ దూబే లాంటి ఆటగాళ్లకు కూడా ఈ జట్టులో అవకాశం కల్పించారు.  ఇక ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ ఏ జట్టు భారత్ ఏ జట్టుతో మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ లు ఆడబోతుంది. సెప్టెంబర్ 1వ తేదీన బెంగుళూరు వేదికగా ఇక తొలి టెస్టు మ్యాచ్ జరగబోతుంది అనేది తెలుస్తుంది. అంతే కాకుండా ఇక ఈ సిరీస్లోని మ్యాచ్లు అన్నీ కూడా బెంగళూరు వేదికగానే జరగబోతున్నాయి. వన్డే సిరీస్ చెన్నై వేదికగా జరుగనుంది.

భారత్‌-ఏ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), యశ్ దూబే, హనుమ విహారి, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, కెఎస్ భరత్ (వికెట్‌ కీపర్‌), షమ్స్ ములానీ, జలజ్ సక్సేనా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, శుభమ్ శర్మ, అక్షయ్ వాడ్కర్, షాబాజ్ అహ్మద్, మణిశంకర్ మురాసింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gil

సంబంధిత వార్తలు: