ఒక మ్యాచ్ ఆడాడో లేదో.. అంతలోనే మళ్ళీ గాయం బారిపడ్డాడు?

praveen
గత కొంత కాలం నుంచి టీమిండియాను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తోంది అన్న విషయం తెలిసిందే. జట్టులో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న వారు వరుసగా గాయాల బారిన పడుతూ చివరికి జట్టుకు దూరం అవుతూ ఉన్నారు. యువ ఆటగాళ్లతో టీమిండియా పటిష్టంగానే కనిపిస్తున్నప్పటికీ జట్టులో సీనియర్ ఆటగాళ్లు లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ ఫేసర్ గా గుర్తింపు పొందిన జస్ప్రిత్ బూమ్రా హర్షల్ పటేల్ గాయం బారినపడి చివరికి ఆసియా కప్ నుంచి తప్పుకున్నారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా కె.ఎల్.రాహుల్ లాంటి వారు కూడా గాయాలతో ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

 గాయం కారణంగా ఎన్నో రోజులు పాటు జట్టుకు దూరమైన కె.ఎల్.రాహుల్ ఇటీవలే మళ్లీ జట్టుతో చేరాడు. అయితే ఇక ఇప్పుడు మరో స్టార్ ప్లేయర్ కూడా గాయం బారిన పడ్డాడు అని తెలుస్తోంది. ఏడాది ఆరంభంలోనే భారత్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టి20 సిరీస్ లో స్టార్ ఫేసర్ దీపక్ చాహర్ గాయం బారిన పడ్డాడు. దీంతో ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక వెన్నునొప్పి కారణంగా విదేశీ పర్యటనకు కూడా దూరమయ్యాడు. ఇటీవలే గాయాల నుంచి కోలుకొనీ జింబాబ్వే పర్యటనలో జట్టుతో చేరాడు. ఇక తొలి వన్డే మ్యాచ్ లోనే మూడు వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచి అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

 ఇప్పటికే ఆసియా కప్ లో స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపికైన దీపక్ చాహర్ మంచి ప్రదర్శన ఇస్తే తుది జట్టులో అవకాశం దక్కించుకునే ఛాన్స్ ఉందని అందరూ అనుకున్నారు. కానీ రెండో వన్డేలో మాత్రం దీపక్ చాహర్ బరిలోకి దిగలేదు.. అతన్ని తప్పించి శార్దూల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకున్నారు. అయితే టాస్ వేసిన సందర్భంగా దీపక్ చాహర్ ని ఎందుకు జట్టు నుంచి తప్పించారు అని కె.ఎల్.రాహుల్ చెప్పలేదు. అయితే తొలి వన్డేలో మరోసారి దీపక్ చాహర్ చిన్నపాటి గాయపడినట్లు తెలుస్తోంది. కాగా ఆసియా కప్ కోసం స్టాండ్బై ప్లేయర్ గా ఉండటంతో అతన్ని రెండో వన్డేలో ఆడించలేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: