టీమిండియాకు ఆ బౌలర్ పెద్ద ఆస్తి : సంజయ్ మంజ్రేకర్

praveen
మరో వారం రోజుల్లో ఆసియాకప్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. అయితే ఆసియా కప్ ముగిసిన కేవలం నెలరోజుల వ్యవధిలోనే అటు ఆస్ట్రేలియా వేదికగా  టి20 వరల్డ్ కప్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో ఆసియా కప్ తో పాటు టి20 వరల్డ్ కప్ లో కూడా టైటిల్ గెలవడమే  లక్ష్యంగా టీమిండియా అన్ని అస్త్రశస్త్రాలను కూడా సిద్ధం చేసుకుంది అన్న విషయం తెలిసిందే.. అయితే ఆసియా కప్ ఆడబోయే జట్టును ఇటీవలే ప్రకటించింది. కాగా ప్రస్తుతం సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయంబారిన పడిన నేపథ్యంలో అతడు లేకుండానే టీమిండియా బరిలోకి దిగబోతోంది అన్న విషయం తెలిసిందే.

 బూమ్రా తో పాటు హర్షల్ పటేల్  కూడా టీమిండియాకు దూరం కావడం కాస్త ఎదురుదెబ్బ లాంటిదే అని చెప్పాలి. కానీ సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ జట్టులోకి రావడం తో అతని నేతృత్వంలోని బౌలింగ్ దళం అటు ఆసియా కప్లో ప్రత్యర్థులను ఢీ కొట్టబోతుంది.  కాగా ప్రస్తుతం ఫాస్ట్ బౌలింగ్ విభాగం తో పాటు స్పిన్ బౌలింగ్ విభాగం కూడా కాస్త పటిష్టంగానే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇక బౌలింగ్ విభాగంలో ఎవరు కీలకంగా మారారు అన్న విషయమై పలువురు మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.

 కాగా ఆసియా కప్ ఆడబోయే భారత బౌలింగ్ విభాగంలో టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఎంతో కీలకంగా మారే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు సంజయ్ మంజ్రేకర్. ఇక దీపక్ చాహర్ ను కూడా జట్టులోకి తీసుకోవడం ఒక మంచి నిర్ణయం అంటూ తెలిపాడు. అయితే ఎన్నో రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన దీపక్ ఆహారం పరీక్షించేందుకు జింబాబ్వేతో జరిగిన వన్డే లకు ఎంపిక చేయడం మంచి నిర్ణయం. అంతేకాకుండా ఆసియా కప్ లో కూడా అతని స్టాండ్ బై  గా తీసుకున్నారు. మంచి ప్రదర్శన చేస్తే తప్పకుండా తుది జట్టులోకి వస్తాడు. భువనేశ్వర్  కఠిన పరిస్థితుల్లో అద్భుతంగా వికెట్లు తీయగలడు. ఇండియా బౌలింగ్ దళానికి అతి పెద్ద ఆస్తి.  ఇక భూమితోపాటు దీపక్ చాహర్ బౌలింగ్ దాడిని చేస్తే  అడ్డుకోవడం ప్రత్యర్థులకు కష్టమే అవుతుంది అంటూ సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: