నేడే రెండో వన్డే.. భారత్ అదే జోరు చూపిస్తుందా?

praveen
ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ లోనే ఎంతో అలవోకగా విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా 10 వికెట్ల తేడా తో విజయం సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది టీమిండియా. ఇక మూడు వన్డేల మ్యాచ్లో భాగం గా నేడు రెండో వన్డే మ్యాచ్ ఆడబోతుంది. అయితే ఇక ఈ వన్డే మ్యాచ్ నిర్ణయాత్మకమైన మ్యాచ్ గా మార బోతుందనీ అందరికి తెలుస్తుంది.  మరో మ్యాచ్ మిగిలి ఉండ గానే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదల తో ఉంది టీమిండియా.

 అదే సమయం లో టీమిండియా పర్యటనకు ముందు బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లలో  భారీ స్కోరును ఛేదించిన ఆతిథ్య జింబాబ్వే జట్టు.. ఇక ఇటీవలే మొదటి వన్డే మ్యాచ్లో మాత్రం భారత ఆల్రౌండర్ దెబ్బకు విలవిల లాడిపోయింది. ఇక ఇప్పుడు ఈ సిరీస్ అవకాశాలను సజీవం గా ఉంచుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారత్ ను ఓడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే తమదైన వ్యూహాలతో జింబాబ్వే జట్టు కూడా సిద్ధమైంది. ఈ క్రమంలోనే రెండు వన్డే మ్యాచ్ లు ఉత్కంఠ భరితంగా మారబోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అయితే గత కొంత కాలం నుంచి అత్యుత్తమ ఓపెనింగ్ జోడిగా కొనసాగుతున్నారు ధావన్- శుభమన్ గిల్. తమకు ఎదురైన ప్రత్యర్థి ఎవరైనా సరే ఎంతో సులువుగా పరుగుల చేస్తూ.. భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేస్తున్నారు. అదే సమయంలో ఇక మిడిలార్డర్లో తన పునరాగమనం చాటిచెప్పాలని కెప్టెన్ రాహుల్ ఎదురుచూస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక సంజూ శాంసన్, దీపక్ హుడా కూడా తమ అద్భుతమైన ఫామ్లో సత్తా చాటుతున్నారు. ఇక బౌలింగ్ విభాగం గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన పనిలేదు. దీపక్ చాహర్ ఎంట్రీతో భారత బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది. దీంతో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: