ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్.. నేటి నుంచే టికెట్స్ అమ్మకాలు?

praveen
మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అభిమానుల దృష్టి మొత్తం ఒకే మ్యాచ్ పై ఉంది. అదే ఆగస్టు 28 వ తేదీన దుబాయ్ వేదికగా జరగబోతున్న భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ పై. కేవలం ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ చూసేందుకు  ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీవీలో ఈ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయడం కాదు ఇక నేరుగా స్టేడియం కి వెళ్లి మ్యాచ్స్ వీక్షించాలని ఎంతో మంది ప్రేక్షకులు సిద్ధమైపోయారు.

 అయితే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా కూడా స్టేడియంలో టికెట్లు హాట్ కేకుల్లా  నిమిషాల వ్యవధిలో అమ్ముడుపోతాయి అని చెప్పాలి. ఈక్రమంలోనే టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారా అని అభిమానులు అందరూ కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూడటం మొదలుపెట్టారు. కాగా ఇక భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ కి సంబంధించిన టికెట్స్ నేటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. ఆసియా కప్ టికెట్స్ విక్రయాలు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబోతున్నాయి అంటూ ప్రకటించింది.. ఇక టికెట్లను బుక్ చేసుకోవడానికి 'platinumlist' సంప్రదించాలి అంటూ సోషల్ మీడియా తెలిపింది.

 కాగా భారత్ పాకిస్థాన్ జట్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
ఆసియా కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్, అవేష్ ఖాన్
ఆసియా కప్‌కు పాక్‌ జట్టు
బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, షాహనావాజ్ ఆఫ్రిది దహానీ  ఉస్మాన్ ఖదీర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: