చెస్ ఒలంపియాడ్ లో ధోని.. ఎందుకెళ్లాడో తెలుసా?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ క్రికెట్ హిస్టరీ లో ఏ కెప్టెన్ సాధించని అరుదైన రికార్డులను ధోని సాధించాడు అనే చెప్పాలి. అయితే ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ధోని బ్రాండ్ వాల్యూ అంతకంతకు పెరుగుతూ పోతుంది తప్ప ఎక్కడ డౌన్ అవ్వడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ 44 వ చెస్ ఒలంపియాడ్ పోటీలకు హాజరయ్యారు  అన్నది తెలుస్తుంది.

 అదేంటి ధోనీకి క్రికెట్ మాత్రమే కాదు చెస్ కూడా ఆడగలడా అని అనుకుంటున్నారు కదా.. అయితే మహేంద్ర సింగ్ ధోనీ 44వ చెస్ ఒలంపియాడ్ కు హాజరయ్యింది  ఒక ప్లేయర్ గా కాదు ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు  మిస్టర్ కూల్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఈ క్రమంలోనే ధోనీ హాజరు కావడంతో అక్కడ చెస్ క్రీడాకారులు  అందరిలో కూడా ఉత్సాహం నిండిపోయింది అని చెప్పాలి. అయితే మొదటి సారి భారత్ వేదికగా చెస్ ఒలంపియాడ్ పోటీలు  నిర్వహిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లు సహా ఇతర దేశాల చెస్ క్రీడాకారుడు కూడా ఈ పోటీలలో పాల్గొన్నారు.

 అయితే వాస్తవానికి ఇక 44వ చెస్ ఒలంపియాడ్ పోటీలు ఉక్రెయిన్  వేదికగా నిర్వహించాల్సింది. కానీ మిలటరీ దాడుల నేపథ్యంలో ఆఖరి నిమిషంలో ఇక చెస్ గవర్నింగ్ ఫెడరేషన్ సమాఖ్య భారత్ లోని చెన్నై సిటీ లో ఇక ఈ పోటీలు నిర్వహించేందుకు సిద్ధమైంది అనే చెప్పాలి. ఇలా భారత్కు చెస్ ఒలంపియాడ్ నిర్వహించే సువర్ణ అవకాశం దొరికింది. అయితే ఈ పోటీల ప్రారంభం వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేయగా ఇక ఇప్పుడు ముగింపు వేడుకలకు మహేంద్ర సింగ్ ధోనీ వెళ్లారు. ఇక మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ విషయానికి వస్తే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనేఈ ఏడాది ఐపీఎల్ లో మాత్రం ధోనీ కెప్టెన్సీలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘోరంగా విఫలం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: