అతన్ని టీమిండియా నుంచి పక్కన పెట్టండి : పార్థివ్ పటేల్

praveen
టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా ఎదిగిన శ్రేయస్ అయ్యర్ కు  ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి పేలవమైన ఫామ్ లో కొనసాగుతూ చివరికి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఇప్పటికే ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా షార్ట్ పిచ్ బంతులను వికెట్ సమర్పించుకొని విమర్శలు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ వెస్టిండీస్ పర్యటనలో అవకాశాలు దక్కించుకున్నాడు. అయితే వెస్టిండీస్ పర్యటనలో కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు.

 ఒకవైపు తోటి ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ టి-20లో అదరగొడుతూ భారీగా ఇన్నింగ్స్ లో ఆడుతూ ఉంటే.. అతనికి సహకారం అందించడం లో అటు శ్రేయస్ అయ్యర్ మాత్రం విఫలం అవుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి శ్రేయస్ అయ్యర్ అవుటైన విధానం విమర్శల పాలు చేస్తోంది. ఇటీవలే మూడో టీ-20లో భాగంగా 27 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేశాడు శ్రేయస్ అయ్యర్.  అవసరమైన షాట్ కు ప్రయత్నించి చివరికి అవుటయ్యాడు. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ పై మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

 శ్రేయస్ అయ్యర్ నీ టీమిండియా నుంచి తొలగించాలి అంటూ డిమాండ్ చేశాడు. అతని స్థానంలో మంచి ఫామ్ లో ఉన్న దీపక్ హుడాను దింపాలని సూచించాడు పార్థివ్ పటేల్. ఒకవేళ   రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకుంటే అతని బరిలోకి దింపిన పర్వాలేదు అంటూ వ్యాఖ్యానించాడు. బంగారంలాంటి అవకాశాలను శ్రేయస్ అయ్యర్ వృధా చేసుకుంటున్నాడు అంటూ విమర్శించాడు పార్థివ్ పటేల్. ఇక బౌలింగ్ లో ఇబ్బంది పడుతున్న  ఆవేశ్ ఖాన్ స్థానంలో హర్షల్ పటేల్ ను తీసుకోవాలని సూచించాడు. మరి శనివారం జరగబోయే 4వ  టీ20 మ్యాచ్లో భారత జట్టు లో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: