సంజూ శాంసన్.. నిజంగా నక్క తోక తొక్కాడబ్బా?

praveen
ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసిన కారణంగా అటు ఎన్నో రోజుల తర్వాత సంజూ శాంసన్ టీమిండియా లో అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఇటీవల వెస్టిండీస్ పర్యటన లో భాగంగా వన్డే సిరీస్ లో అవకాశం దక్కించుకున్న సంజూ శాంసన్ తన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు. అయితే వన్డే సిరీస్ లో తన ప్రదర్శన తో ఆకట్టుకున్నప్పటికీ టీ20 సిరీస్ లో బరి లోకి దిగి పోయే భారత జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు. అయితే సంజు శాంసన్ నక్క తోక తొక్కినట్లుగానే  అదృష్టం తలుపు తట్టింది అనే చెప్పాలి.

 జట్టులో ఉన్న కె.ఎల్.రాహుల్ కరోనా వైరస్ బారినపడి అనూహ్యంగా టీమిండియాకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక కె.ఎల్.రాహుల్ చోటు టీమిండియా లో ఖాళీ అయింది. ఇక కేఎల్ రాహుల్ స్థానంలో ఎవరిని భర్తీ చేయాలని సెలెక్టర్లు ఆలోచించిన సమయంలో అంతకుముందు జరిగిన వన్డే సిరీస్లో బాగా రాణించిన సంజూ శాంసన్ ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఇక టీ20 సిరీస్ లో కూడా సంజూ శాంసన్ అందుబాటులోకి వచ్చాడు అనే విషయం తెలిసిందే.

 ఇలా గత కొంత కాలం నుంచి టీమిండియాకు దూరమయిన సంజూ ఇప్పుడిప్పుడే మంచి ప్రదర్శనతో టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు సంజూ శాంసన్ . ఇక జట్టులో చోటు దక్కడం మాత్రం అదృష్టమనే చెప్పాలి. దీంతో ఎంతోమంది అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి టి20 మ్యాచ్ లో భాగంగా  58 పరుగుల తేడాతో విజయం సాధించింది  టీమిండియా.  అయితే మొదట టి20 మ్యాచ్ లో మాత్రం సంజూ శాంసన్ తుది జట్టులో చోటు దక్కించుకోలేదు. ఇక తర్వాత మ్యాచ్ లో అయినా తుది జట్టులోకి  వస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: