ఫ్రాన్స్ ఓపెనర్.. అరుదైన ప్రపంచ రికార్డు?

praveen
ఇటీవలి కాలంలో టీ20 లో ఎంతో మంది యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు సాధించిన రికార్డును ఎంతో అలవోకగా బ్రేక్ చేస్తున్నారు. ఎన్నో ప్రపంచ రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలా యువ ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతుంది. ఇప్పుడు ఇలా ఓ యువ ఆటగాడు సాధించిన సెంచరీ గురించి.. బద్దలు కొట్టిన ప్రపంచ రికార్డు గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది అని చెప్పాలి.

 ఫ్రాన్స్ ఓపెనర్ గుస్తావ్ మెక్ కిన్  ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.. అంతర్జాతీయ టి20 క్రికెట్ లో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. టి20 ప్రపంచకప్ లో యూరప్ క్వాలిఫైయర్ గ్రూపు బి లో స్విజర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ ఓపెనర్ గుస్తావ్ మెక్ కిన్ సెంచరీతో అదరగొట్టాడు. తద్వారా అంతర్జాతీయ టి20లో సెంచరీల సాధించిన అతి పిన్న వయస్కుడిగా ఈ యువ ఆటగాడు అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. కేవలం 18 ఏళ్ళ 280 రోజుల వయస్సులోనే గుస్తావ్ మెక్ కిన్ సెంచరీ సాధించి అదరగొట్టాడు.

 ఇక ఇలా అతి చిన్న వయసులో ఈ అంతర్జాతీయ టి20లో సెంచరీలు చేసిన రికార్డు అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ హజరతుల్లాహ్ జజాయీ పేరిట ఉండేది. జాజాయ్ సెంచరీ  20ఏళ్ల 337 రోజుల సెంచరీ చేసి రికార్డు కొట్టాడు. ఇప్పుడు గుస్తావ్ మెక్ కిన్ రికార్డును బద్దలు కొట్టేశాడు అని చెప్పాలి. ఇక మ్యాచ్ విషయానికి విషయానికి వస్తే ఫ్రాన్స్ పై స్విజర్లాండ్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఫ్రాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన స్విజర్లాండ్ 9 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: