ఎనిమిదేళ్ల తర్వాత.. ఆ దేశ పర్యటనకు న్యూజిలాండ్?

praveen
గత కొంత కాలం నుంచి న్యూజిలాండ్ జట్టు వరుసగా విదేశీ పర్యటనలకు వెళ్తు బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే వరుస విజయాలతో సత్తా చాటుతుంది న్యూజిలాండ్ జట్టు. ఇకపోతే ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లేందుకు న్యూజిలాండ్ జట్టు సిద్ధమైంది అని చెప్పాలి. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టి20 సిరీస్తో పాటు వన్డే సిరీస్ కూడా ఆడ బోతుంది కివీస్ జట్టు. ఇక న్యూజిలాండ్ వెస్టిండీస్ పర్యటన కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే చివరిసారిగా 2014లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది న్యూజిలాండ్ జట్టు.

 ఇప్పటి వరకూ ఇదే చివరిది కావడం గమనార్హం. 2014 తర్వాత ఇప్పటి వరకూ మళ్లీ వెస్టిండీస్ గడ్డపై అడుగు పెట్టలేదు న్యూజిలాండ్ జట్టు. ఇక ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో న్యూజిలాండ్ విండిస్ పర్యటన హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక వెస్టిండీస్ పర్యటనలో వరుసగా సిరీస్ లు ఆడబోయే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. కాగా మొన్నటి వరకు పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరంగా ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెస్టిండీస్తో సిరీస్లో బరిలోకి దిగేందుకు సిద్దమయ్యాడు.

 మొన్నటి వరకు విశ్రాంతి తీసుకున్న సీనియర్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌదీ కూడా తిరిగి జట్టులోకి వచ్చారు అని చెప్పాలి. ఇక వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆగస్టు 10వ తేదీన జమైకా వేదికగా తొలి టీ-20 మ్యాచ్లో వెస్టిండీస్ తో తలపడుతుంది న్యూజిలాండ్ జట్టు. మొన్నటికి మొన్న సీనియర్ ఆటగాళ్లు లేకుండానే ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన న్యూజిలాండ్ జట్టు సత్తా చాటింది. పూర్తి ఆధిపత్యం సాధించి వన్డే టి20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో ఎలా రాణించ బోతుంది  అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: