సంజు శాంసన్ వల్లే.. టీమిండియా గెలిచిందా.. ఆ ఒక్క బంతి వదిలేసుంటే?

praveen
ఇటీవలే వెస్టిండీస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 308 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదన కావడంతో ఇక వెస్టిండీస్పై కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే చాలు సునాయాసంగా గెలిచేందుకు అవకాశం ఉంది అని టీమిండియా భావించింది. కానీ చివరికి చూసుకుంటే మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు  ఆకలి బంతి వరకు తీసుకొచ్చారు వెస్టిండీస్ బ్యాట్స్మెన్లు. ఒక రకంగా  టీమిండియాకు ఓటమి భయం రుచి చూపించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇక చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో కేవలం మూడు పరుగుల తేడాతో మాత్రమే భారత జట్టు విజయం సాధించింది అంటే మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే చివరి బంతికి పరుగులు సేవ్ చేసి టీమిండియాకు విజయాన్ని అందించిన వికెట్-కీపర్ సంజూ శాంసన్ పై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. చివరి ఓవర్లో సంజూ శాంసన్ పరుగులు ఆపకపోయి ఉంటే టీమిండియా కథ ముగిసేది అంటూ ఎంతో మంది నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు. కేవలం సంజు శాంసన్ వల్లే టీమిండియా విజయం సాధించింది అంటూ కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం.

 వెస్టిండీస్ బ్యాట్స్మెన్ లు అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలోనే భారీ టార్గెట్ ను కూడా అలవోకగా ఛేదించే లాగే  కనిపించారు. అయితే చివరి ఓవర్లో వెస్టిండీస్ విజయానికి 15 పరుగులు రావాల్సి ఉంది. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ వేస్తున్నాడు. మొదటి బంతి కి ఒక్క పరుగు కూడా రాలేదు. ఇక రెండో బంతికి లెగ్ బై రూపంలో ఒక పరుగు వచ్చింది. మూడో బంతి బౌండరీ వెళ్ళింది. దీంతో గణాంకాలు మారిపోయాయి. నాలుగో బంతికి రెండు పరుగులు ఇక 5వ బంతి వైడ్ గా మారి పోయింది. ఈ క్రమంలోనే చివరి బంతి లెగ్ బై రూపంలో ఫోర్ రావాల్సి ఉన్నప్పటికీ సంజూ శాంసన్ ఎంతో అద్భుతంగా డైవ్ చేసి దూరం నుంచి వెళ్తున్న బంతిని ఆపాడు. దీంతో కేవలం 2 పరుగులు మాత్రమే రావడంతో చివరి మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఇండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: