కోహ్లీ నెంబర్ 1.. ధోని నెంబర్ 2.. తగ్గేదేలే అంటున్న మాజీ కెప్టెన్లు?

praveen
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత జట్టులో ఎంత కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే విరాట్ కోహ్లీ ఫామ్ తో సంబంధం లేకుండా అటు సోషల్ మీడియాలో పాపులారిటీ మాత్రం అంతకంతకూ పెంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే  కోహ్లీ సోషల్ మీడియా ఖాతా నుంచి ఏదైనా పోస్టు వచ్చింది అంటే చాలు అది క్షణాల వ్యవధిలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతు  తెగ వైరల్ అవుతూ ఉంటుంది. అంతే కాదు సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్య లో కూడా విరాట్ కోహ్లీ రోజురోజుకీ ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 మాజీ క్రికెటర్ల నుంచి ప్రస్తుత క్రికెటర్ల వరకు ప్రస్తుతం భారత క్రికెట్ చరిత్రలో మోస్ట్ పాపులర్ క్రికెటర్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు చెప్పే పేరు విరాట్ కోహ్లీ అని చెప్పాలి. మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్,  రోహిత్ శర్మ లాంటి వారికి పాపులారిటీ ఉన్న అది కోహ్లీ తర్వాతే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే కేవలం క్రికెట్లో రాణించడమే కాదు ఎన్నో బ్రాండ్స్ కి ప్రమోషన్స్ చేయడం ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఇలా బ్రాండ్ ప్రమోషన్, సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.

 ఇటీవలే విరాట్ కోహ్లీ మరోసారి నెంబర్వన్ స్థానంలో నిలిచాడు. ఇటీవలే జూన్ నెలకు సంబంధించి దేశంలో అత్యంత ఆదరణ కలిగిన క్రీడాకారుల జాబితాను ప్రముఖ మీడియా సంస్థ ఓర్మాక్స్ మీడియా ఇటీవలే లిస్టు ప్రకటించింది. ఇక ఈ లిస్ట్ లో చూసుకుంటే టీమిండియా మాజీ కెప్టెన్ అభిమానుల రన్ మిషన్  విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ లో కొనసాగుతూ ఉండటం గమనార్హం. ఇక ఇదే లిస్టులో మోస్ట్ పాపులర్ ప్లేయర్గా రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. మూడవ స్థానంలో ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో, నాలుగవ స్థానంలో సచిన్,ఐదవ స్థానంలో రోహిత్ శర్మ, ఆరవ స్థానంలో మెస్సి, ఏడవ స్థానంలో పీవీ సింధు, 8వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 9వ స్థానంలో సానియామీర్జా, పదవ స్థానంలో కె.ఎల్.రాహుల్ అత్యంత పాపులర్ క్రీడాకారులుగా టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: