మేనేజ్మెంట్ సరిగ్గా ఉంటే.. ఉమ్రాన్ కి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో?

praveen
ఈ ఏడాది ఐపీఎల్లో అనూహ్యంగా తెరమీదకు వచ్చాడు స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్. 150కిపైగా కిలోమీటర్ల వేగంతో బంతులను విసురుతూ బ్యాట్స్మెన్లను  తెగ ఇబ్బందులకు గురి చేశాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో సత్తా చాటిన ఉమ్రాన్ మాలిక్ సౌత్ ఆఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ లో ఎంపికయ్యాడు. కానీ తుది జట్టులో అవకాశం రాలేదు. ఐర్లాండ్ లో జరిగిన సిరీస్ ద్వారా ఎంపికై తుది జట్టులోకి అరంగేట్రం చేసాడు అన్న విషయం తెలిసిందే. కాగా తొలి టి20లో ఒకే ఒక ఓవర్ అవకాశం దక్కించుకున్న ఉమ్రాన్ మాలిక్ రెండో టీ20లో 4  ఓవర్లు వేసి 42 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఇంగ్లండ్లో కూడా తొలి టీ20లో నాలుగు ఓవర్లు 56 పరుగులు ఇచ్చాడు. తర్వాత టి20 లలో మాత్రం అవకాశం దక్కించుకోలేక పోయాడు

 ఇక మరికొన్ని రోజుల్లో టీమిండియా వెళ్లబోతున్న వెస్టిండీస్ పర్యటనలో కూడా చోటు దక్కించుకోలేదు. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఉమ్రాన్ మాలిక్ ను టీమిండియాలో కి సెలెక్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం రెండు టి20 మ్యాచ్ లో మాత్రమే ఆడించిన టీమిండియా మేనేజ్మెంట్ అతని తప్పించడం ఏంటి అంటూ ప్రశ్నించాడు. వెస్టిండీస్ పర్యటనలో అతనికి  చోటు లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ చెప్పుకొచ్చాడు.

 అతనికి రెస్టు ఇచ్చారా లేదా పూర్తిగా జట్టు నుంచి తప్పించారా అంటూ ప్రశ్నించారు. కేవలం రెండు మ్యాచుల్లోనూ అద్భుతం చేయాలి అంటే అది జరిగే పని కాదు. కనీసం అతనితో బౌలింగ్ విషయంలో మెలకువల గురించి మాట్లాడారా.. కాస్త మంచి మేనేజ్మెంట్ ఉండి ఉంటే బాగుండేది.. అతనికి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో.. అతనికి అన్ని టీమ్స్ లో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అన్నిటి నుంచి తపిస్తున్నారు.. వెస్టిండీస్ పంపించకుండా జింబాబ్వే టూర్ కి పంపించాలి అనుకుంటున్నారా? భారత జట్టు తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు అనుకుంటే అతనికి అవకాశాలు ఇవ్వండి.. అతను సిద్ధంగా లేకపోతే ఇక జట్టుకు సెలెక్ట్ చేయడం ఎందుకు తుది జట్టులో అవకాశం ఇవ్వకుండా తప్పించడం ఎందుకు అంటూ ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: