దయచేసి అతనికి విశ్రాంతి ఇవ్వకండి : ఆకాష్ చోప్రా

praveen
ఇటీవలి కాలంలో టీమిండియా వరుసగా విదేశీ పర్యటనలకు వెళ్తూ  మూడు ఫార్మాట్ లతో కూడిన సిరీస్ లు ఆడుతుంది అనే విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అటు టీమిండియాలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వరసగా ఎంతో మంది కీలక ప్లేయర్లకు విశ్రాంతి ఇస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇంగ్లండ్పర్యటనలో భాగంగా టీమిండియా లో ఆడుతున్న ఎంతో మంది ఆటగాళ్లకు అటు వెస్టిండీస్ పర్యటనలో కూడా విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది   ఇక ఇలా విశ్రాంతి ఇచ్చిన ఆటగాళ్లలో  భారత లెగ్ స్పిన్నర్ చాహల్ కూడా ఉండడం గమనార్హం.

 గత కొంత కాలం నుండి అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకుంటున్న చాహల్ కు బ్రేక్ ఇవ్వడం పై పలువురు మాజీ క్రికెటర్లు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు  ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడాడు.  చాహల్ 2021, 22 లలో లm టీమిండియా తరఫున మొత్తం 17 మ్యాచ్లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. ఇక అతను అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. అలాంటి చాహల్ కు బ్రేక్ ఇవ్వడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు ఆకాశ్ చోప్రా. అతను ఇంకా క్రికెట్ ఆడగలడు.. ఇప్పుడే విశ్రాంతి అవసరం లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

 ఫామ్ లో ఉన్నప్పుడు వారికి విశ్రాంతీ ఇవ్వకపోతేనే అతను లయ కోల్పోకుండా ఉంటాడు. ఐపీఎల్లో అతను అన్ని మ్యాచులు ఆడినప్పటికీ బ్రేక్ తీసుకుని అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ అతడు గాయపడి రెస్ట్ అడిగితే పర్వాలేదు. కానీ చాహల్ బ్రేక్ అడిగాడా సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారా అన్న అంశంలో నిజాలు ఏమిటి అనేది మనకు తెలియదు. కాబట్టి ఒక అంచనాకు రాలేము. ఐర్లాండ్ టి20 సిరీస్ లో ఒకే ఒక మ్యాచ్లో చాహల్ కు అవకాశం ఇచ్చారు. ఇంగ్లాండ్ 2 మ్యాచ్ లు ఆడిన తర్వాత వెస్టిండీస్ టూర్ కు పక్కన పెట్టడం సరైనది కాదు. వన్డే లతో పాటు టీ20 లలో కూడా చాహల్ ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది అని  అభిప్రాయం వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో చాహల్ కు బ్రేక్ కూడా ఏమాత్రం మంచిది కాదు అంటూ ఆకాశ్ చోప్రా తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: