ఓరి నాయనో : బౌలర్ కర్చీఫ్ కింద పడిందని.. నాటౌట్ ఇచ్చిన అంపైర్?

praveen
సాధారణంగా క్రికెట్కు సంబంధించిన ఏదైనా వీడియో సోషల్ మీడియాలో వచ్చిందంటే చాలు అది క్షణాల్లో వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. అయితే కొన్నిసార్లు మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో కొన్ని ఆసక్తికర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు బ్యాట్స్మెన్లను దురదృష్టం వెంటాడితే.. మరి కొన్నిసార్లు అదృష్టం వరిస్తుంది. బౌలర్ వేసిన బంతి ఫీల్డర్లు క్యాచ్ పడితే ఇక వికెట్ అంటూ సంబరాల్లో మునిగి పోయిన సమయంలో అంపైర్ నో బాల్ గా ఇస్తే అందరూ నిరాశలో మునిగిపోతారు.
ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే.. ఇటీవలే న్యూజిలాండ్ ఐర్లాండ్  మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.  విషయం తెలిస్తే మాత్రం తప్పకుండా ఆశ్చర్య పోక మానరు. అంతర్జాతీయ క్రికెట్లో అలిందార్ అనే అంపైర్  దాదాపు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో మ్యాచ్ లలో అంపైరింగ్ చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇటీవలే తన అంపైరింగ్ తో అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇటీవల ఐర్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్  బ్యాట్స్మెన్ సిమీ సింగ్  11 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో న్యూజిలాండ్ పేసర్ టిక్నెర్ బౌలింగ్ చేశాడు. అది బ్యాట్స్మెన్ బ్యాట్ ఏడ్జ్ కి  తాకి కీపర్ చేతిలో పడింది.

 న్యూజిలాండ్ ఆటగాళ్లు అందరూ కింద కింద సంబరాల్లో మునిగిపోయారు. అక్కడున్న అఫైర్ కూడా ఔట్ ఇచ్చాడు.  కానీ మరో అంపైర్ అలిందార్ దాన్ని నాటౌట్గా పేర్కొన్నాడు. ఎందుకంటే బౌలర్ బంతిని వేసేముందు  తన ఫాంట్ నుండి ఖర్చీఫ్  కింద పడిపోయిందని.. ఇది బ్యాట్స్మెన్  దృష్టి మరల్చే అవకాశం ఉండడంతో నాటౌట్గా  ప్రకటించాడు. అయితే క్రికెట్ నిబంధనలు 20.4.2.7 క్లాజ్ ప్రకారం బంతి వేసే ముందు బౌలర్ బ్యాట్స్మెన్ దృష్టి మరల్చేందుకు ఏదైనా చేస్తే దానిని డెడ్ బాల్  గా ప్రకటించాలీ.  ఈ నిబంధనను గుర్తు పెట్టుకున్న అలీందర్ సిమి సింగ్ ను నాటౌట్గా ప్రకటించాడు. దీంతో న్యూజిలాండ్ కెప్టెన్, బౌలర్ కూడా అంపైర్  తో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: