రోహిత్ కి ఒక రూల్.. కోహ్లీకి ఒక రూలా : సునీల్ గవాస్కర్

praveen
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక విషయం గురించి తెగ చర్చ జరుగుతోంది. అదే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి. కేవలం భారత క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదండోయ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది ఇదే విషయం గురించి తెగ చర్చించుకుంటున్నారు. రానున్న రోజుల్లో విరాట్ కోహ్లీ కెరియర్ ఎటు పోతుందో అన్న విషయంపై అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడుగా.. తనను బీట్ చేసే ఆటగాడు ఎవరు లేరు అనేంతలా తన ప్రస్థానాన్ని కొనసాగించాడు విరాట్ కోహ్లీ.

 కానీ గత మూడేళ్ళ నుంచి మాత్రం విరాట్ కోహ్లీ ఎక్కడ మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. కోహ్లీ సెంచరీ చేసి కూడా మూడు ఏళ్లు గడిచిపోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.దీంతో మాజీ ఆటగాళ్లు అందరు కూడా విరాట్ కోహ్లీ ఫామ్ పై స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై సునీల్ గవాస్కర్ కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, వెంకటేష్ ప్రసాద్ లాంటివారు కోహ్లీ ఫాంపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో స్పందించిన సునీల్ గవాస్కర్ కోహ్లీ కి మద్దతుగా నిలిచాడు.

 అంతేకాదు ఈ చర్చ లోకి కొత్తగా రోహిత్ శర్మ ను కూడా లాగేసాడు. ఇటీవల ఓ టీవీ క్రీడ ఛానల్తో మాట్లాడుతూ రోహిత్ శర్మ పరుగులు చేయనప్పుడు ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ప్రశ్నించలేదు. ఇక ఇతర ఆటగాళ్లు కూడా ఫామ్ లో లేనప్పుడు ఇలాంటి ప్రశ్నలు వెయ్యలేదు. ఒక్క కోహ్లీ విషయంలోనే ఎందుకిలా జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు అంటూ సునీల్ గవాస్కర్ తనదైన శైలిలోనే కామెంట్ చేశాడు. ఏ ఆటగాడి విషయంలో అయినా ఫామ్ లేమీ అనేది తాత్కాలికం.. ఆటగాడి నాణ్యత శాశ్వతం. ఇంగ్లాండులో దూకుడు ఆడాలని కోహ్లీ భావించాడు. అయితే కోహ్లీ ఈ క్రమంలోనే త్వరగా అవుట్ అయ్యాడు. కొన్నిసార్లు దూకుడు ఆడాలనే క్రమంలో బ్యాట్స్మెన్లు విఫలం అవుతారు. కానీ ఇదే విషయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇక అతని పై వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ వ్యాఖ్యానించాడు  సునీల్ గవాస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: